Viral Video: థియేటర్‌లో అలా రీల్ చేసినందుకు.. విజయ్ అభిమానిని చితక్కొట్టిన అజిత్ ఫ్యాన్స్.. వీడియో వైరల్

తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఈ హీరోల అభిమానుల మధ్య వైరం కొనసాగుతోంది. తాజాగా మరోసారి ఇది పునరావృతమైంది. దళపతి విజయ్ అభిమానిపై అజిత్ ఫ్యాన్స్ మూకుమ్ముడిగా దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

Viral Video: థియేటర్‌లో అలా రీల్ చేసినందుకు.. విజయ్ అభిమానిని చితక్కొట్టిన అజిత్ ఫ్యాన్స్.. వీడియో వైరల్
Thalapathy Vijay, Ajith

Updated on: Jan 25, 2026 | 4:17 PM

తమిళ చిత్ర పరిశ్రమలో తలా అజిత్ కుమార్, దళపతి విజయ్ అభిమానుల మధ్య ఉండే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని సార్లు ఈ పోటీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఎంతలా అంటే ఒక హీరో అభిమాని మరో హీరో అభిమానిపై దాడి చేసేలా. గతంలో ఇది సార్లు చాలా జరిగింది. ఇప్పుడు మరోసారి అది పునరావృతమైంది. వివరాల్లోకి వెళితే.. అజిత్ కుమార్ నటించిన మంగత్తా (తెలుగులో గ్యాంబ్లర్) సినిమా మళ్లీ థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా చూడటానికి అజిత్ అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. తమిళనాడులోని పెద్ద ఎత్తున థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలోనే విజయ్ అభిమాని ఒకరు కూడా ఈ సినిమా చూసేందుకు థియేటర్ కు వచ్చాడు. అయితే సినిమా ప్రదర్శిస్తోన్న సమయంలో అతను టీవీకే పార్టీ జెండాను పట్టుకుని హల్ చల్ చేశాడు. ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇది అజిత్ అభిమానులకు బాగా కోపం తెప్పించింది. అంతే.. టీవీకే జెండాను పట్టుకుని రీల్స్ చేస్తోన్న విజయ్ అభిమానిని థియేటర్ నుంచి బయటకు తీసుకొచ్చి చితక్కొట్టారు విజయ్ అభిమానులు. దీనిని చాలా మంది తమ సెల్ ఫోన్ కెమెరాలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ గా మారింది.

సినిమాలకు దూరమైన దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా మారిపోయారు. టీవీకే పార్టీని స్థాపించిన ఆయన ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఈక్రమంలోనే అభిమానులు కూడా ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు. టీవీకే పార్టీ జెండా పట్టుకుని తిరుగుతున్నారు. అదే ఇప్పుడు గొడవకు కారణమైంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

దళపతి విజయ్ రికార్డు బ్రేక్ చేసిన అజిత్..

రీ-రిలీజ్ పరంగా విజయ్ రికార్డును అజిత్ బద్దలు కొట్టాడు. విజయ్ ‘గిల్లి’ సినిమా రీ-రిలీజ్ అయినప్పుడు మొదటి రోజే 4 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు అజిత్ ‘మంగాత్త’ సినిమా రీ-రిలీజ్ అయి మొదటి రోజే 4.1 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు థియేటర్లలో అద్భుతమైన స్పందన వచ్చింది.

థియేటర్లలో అజిత్ ఫ్యాన్స్ హంగామా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..