Ajith: ఇద్దరు దర్శకులతో హ్యాట్రిక్ సినిమాలు.. నయా రికార్డ్ సెట్‌ చేస్తున్న అజిత్

|

Jun 18, 2021 | 10:13 AM

ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా పేరు తెచ్చుకున్న హీరో, డైరెక్టర్‌ల కాంబినేషన్స్‌ రిపీట్ చేయటం కామన్‌. కానీ వరుసగా రిపీట్ చేసిన సందర్భాలు మాత్రం చాలా తక్కువ.

Ajith: ఇద్దరు దర్శకులతో హ్యాట్రిక్ సినిమాలు.. నయా రికార్డ్ సెట్‌ చేస్తున్న అజిత్
Follow us on

Ajith : ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా పేరు తెచ్చుకున్న హీరో, డైరెక్టర్‌ల కాంబినేషన్స్‌ రిపీట్ చేయటం కామన్‌. కానీ వరుసగా రిపీట్ చేసిన సందర్భాలు మాత్రం చాలా తక్కువ. అలాంటి రేర్‌ కాంబోను రెండుసార్లు రిపీట్ చేసి రికార్డ్ సెట్ చేస్తున్నారు అజిత్‌. వరుసగా ఇద్దరు దర్శకులతో హ్యాట్రిక్‌ సినిమాలు చేస్తున్నారు తలా. గతంలో శివ దర్శకత్వంలో నాలుగు సినిమాలు చేశారు అజిత్. అందులో మూడు సినిమాలు వరుసగా చేయటం ఓ రికార్డ్‌. అయితే ఆ తరువాత హెచ్‌ వినోద్ కాంబినేషన్‌లో సినిమాలు చేయటం మొదలు పెట్టారు. ఇప్పటికే వినోద్ దర్శకత్వంలో నేర్కొండ పార్వై సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న వలిమై సినిమాకు కూడా వినోదే దర్శకుడు. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తుది దశకు చేరుకున్న ఈ సినిమా షూటింగ్ .. కొవిడ్‌ పరిస్థితుల వల్ల తాత్కాలికంగా ఆగింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వినోద్ మాట్లాడుతూ..”ప్రస్తుతం విదేశాలలో తెరకెక్కించాల్సిన ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ మాత్రమే మిగిలి ఉంది. విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు తొలగించగానే చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఈ సినిమాలో అజిత్‌ సీబీసీఐడి అధికారిగా కనిపిస్తారు’’ అని వినోద్‌ చెప్పారు.

దాంతో ఈ సినిమా పైన అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అంతేకాదు అజిత్ నెక్ట్స్ సినిమా కూడా వినోద్ దర్శకత్వంలోనే రూపొందబోతోంది. బోని కపూర్ నిర్మాతగా ఇప్పటికే ఓ సినిమాకు కమిట్‌ అయ్యారు అజిత్.. ఆ సినిమాను హెచ్‌ వినోద్ డైరెక్ట్ చేయబోతున్నారన్న టాక్ కోలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తోంది. ఇలా ఇద్దరు దర్శకులతో హ్యాట్రిక్ సినిమాలు చేస్తూ నయా రికార్డ్ సెట్‌ చేస్తున్నారు అజిత్‌.

మరిన్ని ఇక్కడ చదవండి :

Rashmika Mandanna : టాక్‌ ఆఫ్‌ ది సోషల్ మీడియాగా రష్మిక పెట్.. షూటింగ్ కు కూడా తీసుకెళ్తున్న ముద్దుగుమ్మ..

Cinema Bandi : సినిమా బండి మేకింగ్‌ ఇంట్రస్టింగ్ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్..

Tollywood: మళ్లీ మొదలైన సినిమా సందడి.. రిలీజ్ కు రెడీ అవుతున్న వాయిదా పడిన సినిమాలు..