Megastar Chiranjeevi: ఎన్నాళ్లకేన్నాళ్లకు బాసూ.. మెగాస్టార్ సరసన నీలి కళ్ల సుందరి.. ఫ్యాన్స్ వెయిటింగ్..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి అసలైన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మన శంకరవరప్రసాద్ గారు. ఇప్పుడు ఈ మూవీ థియేటర్లలో దూసుకుపోతుంది. చాలా కాలం తర్వాత మెగా అభిమానులకు అసలైన ఫుల్ మీల్స్ అందించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

Megastar Chiranjeevi: ఎన్నాళ్లకేన్నాళ్లకు బాసూ.. మెగాస్టార్ సరసన నీలి కళ్ల సుందరి.. ఫ్యాన్స్ వెయిటింగ్..
Megastar Chiranjeevi, Aishw

Updated on: Jan 14, 2026 | 3:45 PM

మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి తెలిసిందే. ఇప్పటికీ వరుస సినిమాలతో యంగ్ హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు. ఏడు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్న చిరు.. ఇప్పుడు సంక్రాంతి పండక్కి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. చిరు నటించిన లేటేస్ట్ మూవీ మన శంకరవరప్రసాద్ గారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇందులో నయనతార కథానాయికగా నటించగా.. వెంకటేశ్, కేథరిన్ కీలకపాత్రలు పోషించారు. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన ఈ మూవీ ఇప్పుడు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దీంతో ఇప్పుడు చిరు రాబోయే సినిమాలపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

చాలా కాలం తర్వాత మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో చిరు హిట్ అందుకోవడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో చిరు చేతిలో ఉన్న మరో ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. మన శంకరవరప్రసాద్ గారు సినిమాతోపాటు విశ్వంభర చిత్రంలో సైతం నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత చిరు డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..

వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ కథానాయికగా నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. త్వరలోనే చిత్రయూనిట్ ఈ ముద్దుగుమ్మతో చర్చలు జరపనున్నారని టాక్. దీంతో ఈ మూవీపై మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఎందుకంటే చిరు సరసన ఐశ్వర్య రాయ్ జతకట్టడం మొదటి సారి. దీంతో ఈ సినిమా అభిమానులకు భారీగానే ట్రీట్ అనుకోవాలి.

ఈ చిత్రంలో మలయాళీ స్టార్ మోహన్ లాల్ కీలకపాత్ర పోషించనున్నారట. అలాగే ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. రస్టిక్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నారట చిరు. మొత్తానికి అప్డేట్స్ కంటే ముందే ఈ సినిమాపై భారీ బజ్ నెలకొంది.

 

Megastar Chiranjeevi

ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..