Aaradhya: ఐశ్వర్య కూతురు అచ్చం సౌందర్యాలనే ఉందే.. వైరల్ అవుతున్న ఫోటోలు

|

May 27, 2024 | 4:28 PM

ప్రస్తుతం చదువుకుంటున్న ఈ స్టార్ కిడ్ తరచూ తన తల్లితో కలిసి ఈవెంట్స్ కు, ఫంక్షన్స్ కు హాజరవుతోంది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.తల్లితో కలిసి ఫోటోలకు ఫోజులిస్తుంది ఈ చిన్నది.. ఈ చిన్నారికి ఇప్పటికే భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అయితే మొన్నటివరకు ఒకలా ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు చాలా అందంగా మారిపోయింది. చూడటానికి ముద్దుగా ఉన్న ఆరాధ్య బచ్చన్ పై కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Aaradhya: ఐశ్వర్య కూతురు అచ్చం సౌందర్యాలనే ఉందే.. వైరల్ అవుతున్న ఫోటోలు
Aaradhya
Follow us on

అందాల తార ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ గురించి ఈ మధ్యకాలంలో చాలా రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిన్నదాని ఫోటోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం చదువుకుంటున్న ఈ స్టార్ కిడ్ తరచూ తన తల్లితో కలిసి ఈవెంట్స్ కు, ఫంక్షన్స్ కు హాజరవుతోంది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.తల్లితో కలిసి ఫోటోలకు ఫోజులిస్తుంది ఈ చిన్నది.. ఈ చిన్నారికి ఇప్పటికే భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అయితే మొన్నటివరకు ఒకలా ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు చాలా అందంగా మారిపోయింది. చూడటానికి ముద్దుగా ఉన్న ఆరాధ్య బచ్చన్ పై కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఆమెకు తల్లి ఐశ్వర్య సర్జరీ చేయించిందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలాఉంటే  ఇప్పుడు కొందరు ఆరాధ్య ఫోటోను సౌత్ స్టార్ నటితో పోలుస్తున్నారు. అచ్చం ఆ హీరోయిన్ లానే ఉంది అంటూ సోషల్ మీడియాలో ఇద్దరి ఫోటోలను కలిపి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో కాదు. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా రాణించిన సౌందర్య. అలనాటి అందాల తార సౌందర్య తో ఆరాధ్యను పోల్చుతున్నారు కొందరు నెటిజన్స్. హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆమె చెరిగిపోని ముద్ర వేశారు.

తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. వెంకటేష్, చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు సౌందర్య. అలాగే తమిళ్, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించారు. అదేవిధంగా బాలీవుడ్ లోనూ తన సత్తా చాటారు సౌందర్య. అయితే హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య కన్నుమూయడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. గొప్ప నటిని కోల్పోయాం అంటూ సినీలోకం కన్నీరు పెట్టుకుంది. ఇప్పుడు ఆరాధ్య ఫోటోలను సౌందర్యతో పోల్చుతూ కొంతమంది ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం చదువుకుంటున్న ఈ చిన్నది. ఆ తర్వాత సినిమాల్లోకి వస్తుందేమో చూడాలి.

ఆరాధ్య బచ్చన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

ఆరాధ్య బచ్చన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.