Rana No1 Yaari In AHA: టాలీవుడ్ టాలెంట్‌డ్ హీరోల్లో దగ్గుబాటి వారబ్బాయి రానా ఒకరు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్న యంగ్ హీరో సినిమాలతో పాటు.. బుల్లితెరపైన కూడా సందడి చేస్తోన్న విషయం తెలిసిందే. ‘నెం1యారీ’ పేరుతో ప్రసారమయ్యే ఒక టీవీ షోతో రానా.. బుల్లితెరపై తనదైన శైలిలో నవ్వులు పూయించాడు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను రాబడుతూ.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రానా.
ఇదిలా ఉంటే ఇప్పటికే రెండు సీజన్‌లు పూర్తి చేసుకున్న ఈ టాక్‌షో మూడో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ టాక్‌షోను ఈసారి ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ స్ట్రీమింగ్ చేయనుంది. ఈమేరకు ‘ఆహా’ ఓ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్బంగా రానా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇక ఆహా విడుదల చేసిన నెం1 యారీ మూడో సీజన్ ప్రోమో షోపై ఆసక్తిని పెంచేసిందని చెప్పాలి. ఈ టాక్‌షో మార్చి 14 నుంచి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ‘ఆహా’ ఓటీటీ వేదికగా టెలికాస్ట్ కానుంది. ఇదిలా ఉంటే రానా సినిమాల విషయానికొస్తే.. త్వరలోనే ‘అరణ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక వేణు ఉడుగుల దర్శకత్వంలో ‘విరాట పర్వం’లో నటిస్తున్నాడు. వీటితో పాటు.. గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్య కశ్యప’ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు రానా.
The most favourite Telugu talk-show #No1Yaari is back with a brand new season.
Premieres March 14, on #ahavideoIN.@RanaDaggubati #No1YaariOnAHA
▶️ https://t.co/wiq6XbYK4h pic.twitter.com/RgXcbna9gC
— ahavideoIN (@ahavideoIN) March 6, 2021