AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya Pisse: విడాకులు తీసుకున్న ‘అగ్నిసాక్షి’ సీరియల్ హీరోయిన్.. ఆ పుకార్లపై స్ట్రాంగ్ వార్నింగ్

మరో సెలబ్రిటీ జంట విడిపోయింది. ఇప్పటికే ఏడాది కాలంగా వేరుగా ఉన్న వీరు ఇప్పుడు విడాకులు తీసుకున్నామని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారీ మాజీ కపుల్. తమ నిర్ణయాన్ని గౌరవించాలని, తమకు గోప్యత కావాలంటూ ఆ పోస్టులో కోరారు.

Aishwarya Pisse: విడాకులు తీసుకున్న 'అగ్నిసాక్షి' సీరియల్ హీరోయిన్.. ఆ పుకార్లపై స్ట్రాంగ్ వార్నింగ్
Aishwarya Pisse
Basha Shek
|

Updated on: Oct 13, 2026 | 1:29 PM

Share

ఐశ్వర్య పిస్సే.. పేరుకు కన్నడ నటినే అయినా తెలుగు ఆడియెన్స్ కు కూడా ఈ నటి బాగా పరిచయమే. కన్నడలో పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ అగ్నిసాక్షి సీరియల్ తో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తల్లో నిలిచారీ అందాల తార. నటిగా బిజీగా ఉంటోన్న సమయంలోనే సుమారు ఏడేళ్ల క్రితం హరి వినయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఐశ్వర్య. అయితే గత కొద్ది రోజులుగా వీళ్లిద్దరూ విడిపోయారని , వేరుగా జీవిస్తున్నారని రూమర్లు వస్తున్నాయి. అయితే ఇప్పుడీ పుకార్లను నిజం చేస్తూ తామిద్దరం విడిపోయామని, విడాకులు తీసుకున్నామని ఐశ్వర్య అధికారికంగా ప్రకటించింది. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాగా ఐశ్వర్య పిస్సే మాజీ భర్త ఎవరో కాదు, తెలుగులో సూపర్ హిట్ సీరియళ్లతో పాటు సినిమాల్లోనూ నటించిన నవ్య స్వామికి స్వయానా సోదరుడు. ఈ విషయాన్ని స్వయంగా నవ్వ స్వామినే వెల్లడించింది. తాను ఐశ్వర్యకు ‘హాఫ్ హజ్బెండ్’ అంటూ సరదాగా చెప్పుకొచ్చింది. కాగా ఎంతో అన్యోన్యంగా ఉండే ఐశ్వర్య- వినయ్ విడిపోవడ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ లో ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

‘ నా ప్రియమైన అభిమానులకు, ఫాలోవర్స్ కి , శ్రేయోభిలాషులకు నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి వ్యాపిస్తున్న అనవసరమైన పుకార్లకు ఊహాగానాలకు ముగింపు పలకడానికి ఈ విషయంపై స్పష్టత ఇవ్వడం అవసరమని భావిస్తున్నాను. నేను, నా భర్త హరి గత ఏడాదిన్నర కాలంగా విడివిడిగా నివసిస్తున్నాము. చాలాసార్లు ఆలోచించి, పరస్పర అంగీకారంతోనే మేం విడాకులు తీసుకున్నాం. ఇది మా ఇద్దరి వ్యక్తిగత నిర్ణయం. ఈ టైమ్ లో మాకు అవసరమైన గోప్యతను, మనశాంతిని అందించాలి. మా నిర్ణయాన్ని అందరూ అంగీకరించి , గౌరవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. న్యూస్, ఫాలోవర్స్, లైక్స్ పెంచుకోవాలనే ఉద్దేశంతో తప్పుడు కథనాలను సృష్టించడం , తప్పుదారి పట్టించే వీడియోలను ప్రచురించడం, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం , నా సీరియల్ లోని సన్నివేశాలను సందర్భానికి సంబంధం లేకుండా ఉపయోగించడం, నా వ్యక్తిగత పరిస్థితిని దుర్వినియోగం చేయడం చట్టరీత్యా ఆమోదయోగ్యం కాదు. దయచేసి తెరపై కనిపించే జీవితానికి, నిజ జీవితానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోండి. ప్లీజ్ పుకార్లను వ్యాప్తి చేయడం ఆపండి. ఈ ప్రకటన ఇవ్వడం వెనక ఉద్దేశం స్పష్టమైన హద్దులను తెలియజేయడం మాత్రమే. ప్రతి ఒక్కరూ నా వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తూ, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను’

‘నా పని. నా వృత్తి పబ్లిక్ కావొచ్చు.. కానీ నా వ్యక్తిగత జీవితం నా ప్రైవేటు విషయం.. తప్పుడు, పరువు నష్టం కలిగించే ప్రచారాన్ని తగిన చట్టపరమైన మార్గాల ద్వారా ఎదుర్కొంటాను. ఇలాంటి చర్యలు కొనసాగితే సంబంధిత వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి’ అంటూ సుదీర్ఘ పోస్టు షేర్ చేసింది ఐశ్వర్య. ప్రస్తుతం ఈ బుల్లితెర నటి పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us