Jr NTR: ఆర్ఆర్ఆర్ తర్వాత మరోసారి దర్శకధీరుడితో యంగ్ టైగర్ సినిమా చేయబోతున్నాడా..

|

Jun 05, 2021 | 6:47 AM

యంగ్ జనరేషన్‌లో మరే హీరో సెట్ చేయని రేంజ్‌లో స్ట్రాంగ్ లైనప్‌ను సిద్దం చేశారు యంగ్ టైనర్‌ ఎన్టీఆర్‌. ఒకటి రెండూ కాదు.. ఏకంగా ఐదేళ్ల పాటు చేయాల్సిన సినిమాలను..

Jr NTR: ఆర్ఆర్ఆర్ తర్వాత మరోసారి దర్శకధీరుడితో యంగ్ టైగర్ సినిమా చేయబోతున్నాడా..
Ntr Koratala Shiva New Movie
Follow us on

Jr NTR: యంగ్ జనరేషన్‌లో మరే హీరో సెట్ చేయని రేంజ్‌లో స్ట్రాంగ్ లైనప్‌ను సిద్దం చేశారు యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌. ఒకటి రెండూ కాదు.. ఏకంగా ఐదేళ్ల పాటు చేయాల్సిన సినిమాలను టెంటెటివ్‌గా సిద్ధం చేసేశారు. ఇప్పటికే రెండు మూడు ప్రాజెక్ట్స్ మీద క్లారిటీ కూడా వచ్చేసింది. మిగతా సినిమాలు కూడా ఆల్మోస్ట్ రెడీ అన్న టాకే వినిపిస్తోంది. ప్రజెంట్ ట్రిపులార్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్న తారక్‌… నెక్ట్స్ చేయబోయే రెండు సినిమాలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాయి. ట్రిపులార్‌ తరువాత చేసే కొరటాల మూవీ వర్క్ జరుగుతూనే ఉంది. ఆ తరువాత షార్ట్ గ్యాప్‌ తీసుకొని కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్‌తో సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చేశారు.

ఇవి మాత్రమే కాదు… మరో రెండు సినిమాలు కూడా స్క్రిప్ట్ స్టేజ్‌లో ఉన్నాయన్నది ఇండస్ట్రీ టాక్‌. కొరటాల త్రివిక్రమ్‌ సినిమాలు పూర్తయ్యే సరికి 2023 జూన్‌ వచ్చేస్తుంది. ప్రజెంట్ షారూఖ్‌తో సినిమా రెడీ చేస్తున్న అట్లీ ఆ టైమ్‌కు ఫ్రీ అయ్యేలా ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నారు. అట్లీ సినిమా తరువాత మరోసారి జక్కన్నతో జత కట్టేందుకు ఓకే చెప్పారు ఎన్టీఆర్‌. ట్రిపులార్‌ తరువాత మహేష్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి.. మహా అయితే రెండున్నరేళ్లు ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు.. ఈ లోగా ఎన్టీఆర్‌ కూడా అన్ని కమిట్‌మెంట్స్ క్లియర్‌ చేసుకొని ఫ్రీ అవుతున్నారు. సో 2024లో మరోసారి ఎన్టీఆర్‌.. జక్కన్న కాంబినేషన్‌ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Santosh Shoban: జోరు పెంచిన కుర్రహీరో.. వరుస సినిమాలతో బిజీబిజీ.. త్వరలో ప్రేమ్ కుమార్ గా ప్రేక్షకుల ముందుకు..

Rashmika Mandanna: ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సిన సమయం ఇది.. ఓ మంచి పనికి ముందుకు రండి..

Rakul Preet Singh : సెట్‌లో అడుగుపెట్టేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..