
మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా వచ్చిన ఒకే ఒక్క నటి నిహారిక కొణిదెల. ఇటీవలే నిహారిక తన భర్త చైతన్యతో విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత నిహారికా చాలా యాక్టవ్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు రెగ్యులర్ ఫోటోలు షేర్ చేస్తూ.. అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. అయితే హీరోయిన్ గా నిహారిక ఎక్కువ సినిమాల్లో నటించలేదు. ఆమె తిరిగి సినిమాల్లో హీరోయిన్ గా నటించాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు నిహారిక సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. దాదాపు ఐదేళ్ల తర్వాత నిహారిక సినిమాలో నటించనుంది.
నిహారిక 2016లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా మారింది నిహారిక. ఈ సినిమాలో నాగ శౌర్య హీరోగా నటించాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆతర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించింది. మెల్లగా సినిమాలకు దూరమైన ఈ చిన్నది యూట్యూబ్ వీడియోలు చేస్తూ బిజీ అయ్యింది. ఆ తర్వాత నిర్మాణరంగం వైపు అడుగులేసింది.ఇన్నాళ్లకు మళ్లీ నటనతో ఆకట్టుకోవడానికి రెడీ అవుతుంది నిహారిక.
తమిళంలో నిహారిక కొత్త సినిమా రెడీ అవుతోంది. ఈ చిత్రానికి ‘మద్రాస్కరణ్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. మలయాళ నటుడు షేన్ నిగమ్‌తో కలిసి నిహారిక స్క్రీన్‌ను పంచుకుంటుంది. షేన్‌కి ఇదే తొలి తమిళ సినిమా. నిహారికకు ఇది రెండో తమిళ చిత్రం. గతంలో నిహారిక ‘ఒరు నల్ల బల్ పాతు సోల్రన్’ అనే తమిళ సినిమాలో నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి నిహారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు.
#MadrasKaaran movie #NiharikaKonidela on board & ⭐️’s #ShaneNigam, #KalaiArasan…🤙
Directed by Vaali Mohan DasShooting starts soon…✌️ pic.twitter.com/oVEloer4Pf
— Saran (@rskcinemabuff) February 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.