Adivi Sesh: మేజర్ స్క్రీనింగ్ థియేటర్లో అడివి శేష్ ఎమోషనల్ మూమెంట్.. హత్తుకుంటున్న వీడియో..

ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 3న పాన్ ఇండియా లెవల్లో ఘనంగా విడుదల కాబోతుంది.

Adivi Sesh: మేజర్ స్క్రీనింగ్ థియేటర్లో అడివి శేష్ ఎమోషనల్ మూమెంట్.. హత్తుకుంటున్న వీడియో..
Major

Updated on: May 25, 2022 | 7:56 PM

డైరెక్టర్ శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) నటించిన చిత్రం మేజర్ (Major).. 26/11 ముంబై దాడులలో వీరమరణం పొందిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 3న పాన్ ఇండియా లెవల్లో ఘనంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే చిత్రయూనిట్ ఈ సినిమా ప్రమోషన్లను షూరు చేసింది. ఇందులో భాగంగా బుక్ మై షో సంస్థతో కలిసి మే 24 నుంచి 9 ప్రధాన నగరాల్లో మేజర్ ప్రీవ్యూస్ ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పూణేలో పారా మిలటరీ అధికారులతో కలిసి అడివి శేష్ మేజర్ ప్రీవ్యూను చూశాడు.. ఈ క్రమంలో అక్కడి పారా మిలటరీ అధికారికి.. హీరో అడివి శేష్ మధ్య జరిగిన ఓ సంఘటనకు సంంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పూణేలోని ఓ థియేటర్లో మేజర్ ప్రీవ్యూస్ స్ట్రీమింగ్ జరుగుతుండగా.. అక్కడున్న ప్రేక్షకులంతా భారతీయ జెండాలను ఊపుతూ భారత్ మాతా కీ జై.. వందేమాతరం అంటూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.. అయితే అక్కడే వీల్ చైర్ లో ఉన్న ఓ పారా మిలటరీ అధికారి స్క్రీన్ ముందుకు రాగా.. అతడిని పలకరించాడు అడివిశేష్.. ఆ అధికారిని పలకరిస్తూ మోకాళ్లపై కూర్చోవడంతో ఒక్కసారిగా ఆ అధికారి భావోద్వేగానికి గురయ్యాడు.. అనంతరం సదరు అధికారి అడివి శేష్ కు సెల్యూట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను అడివి శేష్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.. “జై హింద్ నినాదాలు, కేకలు, నవ్వులు, సంతోషాల మధ్య.. కమాండో శివరాజ్ 21 పారా SF అనుభవజ్ఞుడు.. అతని సతీమణి లెఫ్టినెంట్ కల్నల్ శివప్రియగారిని కలవడం సంతోషంగా ఉంది.. ఎలాంటి ప్లానింగ్ లేదు “అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాలో శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి నాయర్, మురళీ శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, మహేష్ బాబు సొంత సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తుండగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

Follow Us