
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తన మంచి మనసును చాటుకున్నాడు. నిత్యం సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉండే ఈ క్రేజీ హీరో తాజాగా క్యాన్సర్‌తో పోరాడుతున్న పిల్లలతో సరదాగా గడిపారు. వారిలో ఒక్కడిగా కలిసిపోయారు. వారితో ఆడిపాడారు. తాజాగా జూడ్ అనే ఓ స్వచ్ఛంద సేవా సంస్థను సందర్శింశాడు శేష్. ఆ సంస్థ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నాడీ యంగ్ హీరో. అక్కడి చిన్నారులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేశాడు. వారికి కొన్ని బహుమతులు కూడా అందజేశాడు. అనంతరం వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ‘పిల్లలతో గడపడం నా జీవితంలో చాలా గొప్ప సందర్భం. ఈ పిల్లలు చాలా ధైర్యంగా ఉన్నారు. వారు క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నారు. వారు నాకు చాలా ఆశను కల్పించారు. ఈ అవకాశం కల్పించిన కమలేష్, లక్ష్మికి ధన్యవాదాలు’ అంటూ ఎమోషనల్ అయ్యాడు శేష్. ప్రస్తుతం అడివి శేష్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హీరో చేసిన గొప్ప పనిని అభిమానులు, నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కాగా జూడ్ సంస్థ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యంఆ వెనకబడిన కుటుంబాలకు వివిధ రకాలుగా సహాయమందిస్తోంది. అలాగే క్యాన్సర్‌పై పోరాటంలో భాగంగా డ్యాన్స్ థెరపీని అందిస్తోంది. ఇందులో భాగంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న పిల్లలకు రోజూ అరగంట పాటు డ్యాన్స్ క్లాస్‌లు ఏర్పాటు చేస్తోంది.
ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది మేజర్, హిట్ 2 సినిమాలతో భారీ హిట్లు ఖాతాలో వేసుకున్నాడు హీరో అడివి శేష్. ప్రస్తుతం గూఢచారి 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. 2018లో హీరో శేష్ నటించిన గూఢచారి సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. G2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ స్పై థ్రిల్లర్ మూవీలో ప్రకాష్ రాజ్, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో G2 సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. త్వరలో ‘G2 ‘సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వెలువడననున్నాయి.
Had one of the most beautiful times of my life with all the amazing children @StJudeChildCare So brave, so full of life even as they fight cancer. They give me so much hope. Thank you for the experience Kamlesh ji and Lakshmi garu ❤️ pic.twitter.com/RqqTYyRD8C
— Adivi Sesh (@AdiviSesh) November 3, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.