Prabhas Adipurush : ‘ఆదిపురుష్‌’ లో హనుమంతుడిగా దేవదత్..? సోషల్‌ మీడియాలో వైరల్‌

Prabhas Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న బాలీవుడ్ స్ట్రైట్ సినిమా 'ఆదిపురుష్‌'. ఇందులో హనుమంతుడి పాత్రలో దేవదత్‌ను తీసుకోనున్నట్టు సోషల్ మీడియాలో..

Prabhas Adipurush : ఆదిపురుష్‌ లో హనుమంతుడిగా దేవదత్..? సోషల్‌ మీడియాలో వైరల్‌
Adipurush

Updated on: May 13, 2023 | 8:19 AM

Prabhas Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న బాలీవుడ్ స్ట్రైట్ సినిమా ‘ఆదిపురుష్‌’. ఇందులో హనుమంతుడి పాత్రలో దేవదత్‌ను తీసుకోనున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో నటీ, నటుల విషయంలో చిత్ర బృందం ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుంటోంది. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీలో ఆయన సరసన సీత పాత్రలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ కృతి సనన్‌ని ఎంపిక చేసుకున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో రావణ్ పాత్రలో సైఫ్అలీఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌ను ఎంపిక చేయగా.. హనుమంతుడి పాత్రలో ఎవరిని సెలెక్ట్ చేస్తారో అని గత కొన్ని రోజులుగా అందరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే హనుమంతుడి పాత్ర ఎవరు చేయబోతున్నారనే ఈ చర్చలకు త్వరలోనే క్లారిటీ రానున్నట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు హనుమంతుడి పాత్రలో మరాఠీ నటుడు దేవదత్ నాగే పేరు వినిపిస్తోంది. అతి త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రానుందని తెలుస్తోంది.ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబయిలో కొంతమేర షూటింగ్‌ కూడా పూర్తి చేసుకుంది. కాగా కరోనా సెకండ్‌ వేవ్‌తో వాయిదా పడిన చిత్ర షూటింగ్ త్వరలోనే పునప్రారంభం కానుంది.

Also Read: అందాల చందమామ కాజల్ ఆస్తుల విలువ ఎంత విలువో తెలిస్తే షాక్..