క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఐపీఎల్ 2023 అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మార్చి 31న అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2023 గ్రాండ్ గా ప్రారంభంకాగా.. ఈ వేడుకలలో టాలీవుడ్ హీరోయిన్స్ రష్మిక మందన్నా.. తమన్నా సందడి చేశారు. తమ డ్యాన్సులతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటతోపాటు.. శ్రీవల్లి చిత్రంలోని సామీ సామీ పాటకు.. మిగతా పాటలకు రష్మిక స్టెప్పులేసి అదుర్స్ అనిపించింది. శ్రీవల్లితోపాటు.. గంగూభాయ్ కతియావాడీలోని డోలీడా పాటకు డాన్స్ తో కేక పుట్టించింది.
ఇక మిల్కీబ్యూటీ తమన్నా సైతం ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకలలో సందడి చేసింది. .. పుష్ప చిత్రంలోని ఊ.. అంటావా..మావా.. ఊ.. ఊ..అంటావా.. ఎనిమీ చిత్రంలోని టమ్ టమ్ పాటలకు తమన్నా స్టెప్పులేసి అదుర్స్ అనిపించింది. ఈ ఇద్దరి పెర్ఫామెన్స్ తో స్టేడియం హోరెత్తింది.
వీరితోపాటు.. బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ తన గాత్రంతో ప్రేక్షకులను అలరించారు. తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొన్నాయి. నటి మందిరా బేడీ ఐపీఎల్ యాంకర్ గా పునరాగమనం చేసింది. ఆమె ఆరంభ వేడుకలకు హోస్ట్ గా వ్యవహరించింది. మొత్తానికి ఈసారి ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకల్లో టాలీవుడ్ పాటలకు హీరోయన్స్ వావ్ అనిపించారు.
Sound ?@iamRashmika gets the crowd going with an energetic performance ?
Drop an emoji to describe this special #TATAIPL 2023 opening ceremony ? pic.twitter.com/EY9yVAnSMN
— IndianPremierLeague (@IPL) March 31, 2023
???????? ?? ????!@tamannaahspeaks sets the stage on ?? with her entertaining performance in the #TATAIPL 2023 opening ceremony! pic.twitter.com/w9aNgo3x9C
— IndianPremierLeague (@IPL) March 31, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.