VaraLaxmi SarathKumar: బాల్యంలోనే లైంగిక వేధింపులకు గురయ్యా.. కన్నీళ్లు పెట్టుకున్న వరలక్ష్మి.. వీడియో వైరల్

|

Mar 21, 2025 | 10:34 PM

ప్రముఖ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది వరలక్ష్మి శరత్ కుమార్. మొదట హీరోయిన్ గా అరంగేట్రం చేసిన ఆమె ఆ తర్వాత లేడీ విలన్ గా మారిపోయింది. ఇప్పుడు తమిళ్ తో పాటు తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తోందీ అందాల తార.

VaraLaxmi SarathKumar: బాల్యంలోనే లైంగిక వేధింపులకు గురయ్యా.. కన్నీళ్లు పెట్టుకున్న వరలక్ష్మి.. వీడియో వైరల్
Varalaxmi Sarathkumar
Follow us on

అటు తమిళ్ సినిమాలతో పాటు ఇటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ బిజీ గా గడిపేస్తోంది నటి వరలక్ష్మీ శరత్ కుమార్. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత లేడీ విలన్ గా మారిపోయింది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూన మరోవైపు నటిగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోనూ వరలక్ష్మి యాక్ట్ చేస్తోంది. గతేడాది హనుమాన్, రాయన్, మ్యాక్స వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది వరలక్ష్మి. ఈ ఏడాది ప్రారంభంలోనే మదగజరాజాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం విజయ్ దళపతి జన నాయగన్ మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే మరికొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లోనూ వరలక్ష్మి భాగమైంది. ఇక సినిమాలతో పాటు పలు టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోందీ అందాల తార. ఇందులో భాగంగా తాజాగా ఓ తమిళ టీవీ షోకు హాజరైన వరలక్ష్మి తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాల గురించి చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తన చిన్ననాటి జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను మళ్లీ గుర్తు తెచ్చుకుని ఎమోషనలైంది. టీవీ షోలో భాగంగా ఒక లేడీ కంటెస్టెంట్ తన జీవితంలో ఎదురైన వేధింపుల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇది చూసిన వరలక్ష్మి కూడా చిన్న తనంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తుకు తెచ్చుకుని ఎమోషనలైంది. ‘నేనూ చిన్నతనంలోనే లైంగిక వేధింపుల బారిన పడ్డాను. నీది నాదీ ఒకటే కథ ‘ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

 

 

ఇవి కూడా చదవండి

కాగా వరలక్ష్మి శరత్ కుమార్ ఇలా ఎమోషనల్ అవ్వడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలోనూ పలు సందర్భాల్లోనూ ఇలాగే కన్నీళ్లు పెట్టుకుంది. ముఖ్యంగా స్టార్ నటుడి కూతురైన వరలక్ష్మి లైంగిక వేధింపుల బారిన పడడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం వరలక్ష్మి కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

నెట్టింట వైరలవుతోన్న వీడియో ఇదే..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.