Vanitha Vijayakumar: ఆ హీరోతో సంబంధం అంటగట్టారు.. తట్టుకోలేకపోయా: వనితా విజయ్ కుమార్

కోలీవుడ్ ప్రముఖ నటి వనితా విజయ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దిగ్గజ నటులైన మంజుల- విజయ్‌ కుమార్‌ల వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆమె దేవి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తమిళ, మలయాళంలోనూ పలు సూపర్ హిట్ సినిమాలు చేసింది.

Vanitha Vijayakumar: ఆ హీరోతో సంబంధం అంటగట్టారు.. తట్టుకోలేకపోయా: వనితా విజయ్ కుమార్
Vanitha Vijayakumar

Updated on: Jul 03, 2025 | 8:21 AM

తల్లిదండ్రులు మంజుల- విజయ్‌ కుమార్‌ల నుంచి నటనను పుణికి పుచ్చుకుని చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వనితా విజయ్ కుమార్. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. తమిళ్, మలయాళ భాషల్లోనూ నటించి మెప్పించింది. పలువురు స్టార్ హీరోలతో కలిసి పలు సూపర్ హిట్ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. మళ్లీ పెళ్లి వంటి కొన్ని సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సపోర్టింగ్ రోల్స్ కూడా చేసింది. అయితే ఈ అందాల తార తన సినిమాల కంటే తన వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ పెళ్లిళ్ల వ్యవహారం సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ చర్చనీయాంశమే. ఈ భామ ఇప్పటికీ మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ముగ్గురికి సైతం విడాకులు ఇచ్చింది. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న ఆమె ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది. ప్రస్తుతం వనిత మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ మూవీ చేస్తోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా దర్శకురాలిగానూ అదృష్టం పరీక్షించుకోనుంది. ఈ సినిమాకు వనితా కూతురు జోవిక నిర్మాతగా వ్యవహరిస్తుండడం విశేషం. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 11న విడుదల కానుంది.

 

ఇవి కూడా చదవండి

మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ సినిమా ప్రమోషన్స్‌లో పొల్గొంటొన్న వనితా విజయ్‌కుమార్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‌ ‘చంద్రలేఖ సినిమాతో హీరోయిన్‌గా నా సినిమా ప్రయాణం మొదలైంది. ఇందులో విజయ్‌ దళపతి హీరో. ఆ సినిమా చేస్తున్నప్పుడు నా వయసు కేవలం 15 ఏళ్లుంటాయనుకుంటాను. అప్పుడు 40 ఏళ్ల వయసున్న రాజ్‌కిరణ్‌తో నాకు ముడిపెట్టి చేసి వార్తలు రాశారు. వాటిని చూసి తట్టుకోలేకపోయాను. సెట్‌లోనే ఏడ్చేశాను. అప్పుడు విజయ్‌ నన్ను చూసి పలకరించకుండానే తన దారిన తాను వెళ్లిపోయాడు. అయితే కొంతసేపటికి నా దగ్గరకు వచ్చి ఏం జరిగిందని ఆరా తీశాడు. ఓ నటుడితో నాకు రిలేషన్‌ అంటగడుతున్నారని, అందుకు చాలా బాధగా ఉందని చెప్పాను.

‘ అప్పుడు విజయ్‌.. నీ గురించి వాళ్లు ఏదీ రాయకపోతే నువ్వు ఇండస్ట్రీలో ఉన్నా లేనట్లే! నీ గురించి ఏదో ఒకటి రాస్తున్నారంటే నువ్వు బాగా ఫేమస్‌ అయ్యావని అర్థం. ఈ విమర్శలు, పుకార్ల గురించి పట్టించుకోకు. ‌ సినిమాలపై ఫోకస్‌ పెట్టు అని సలహా ఇచ్చాడు. దీంతో నా మనసు కాస్త తేలిక పడింది. ఇకపోతే రాజ్‌కిరణ్‌ సర్‌ చాలా మంచివాడు. అలాంటి మనిషి వ్యక్తిత్వాన్ని తప్పుపట్టారు. నాతో సంబంధం అంటగట్టారు. ఈ విషయంలో మాత్రం నేను చాలా బాధపడ్డాను’ అని వనిత విజయ్‌ కుమార్‌ ఎమోషనల్ అయ్యింది.

మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ మూవీ సినిమాలో వనితా విజయ్ కుమార్..

రజనీకాంత్ తో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి