Urvashi Rautela: విమానంలో ఐఫోన్స్ మర్చిపోయిన ఊర్వశి.. సహయం చేయాలంటూ రిక్వెస్ట్..

ఇక రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న ఈ సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. అయితే కొద్ది రోజులుగా క్రికెటర్ పంత్‏పై సోషల్ మీడియాలో పోస్ట్స్ చేసి అందరిని దృష్టి ఆకర్షించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరో ఆసక్తికర పోస్ట్ చేసింది. విమానంలో తన ఐఫోన్స్ మర్చిపోయానని.. వాటిని వెతికేందుకు సాయం చేయాలని కోరింది.

Urvashi Rautela: విమానంలో ఐఫోన్స్ మర్చిపోయిన ఊర్వశి.. సహయం చేయాలంటూ రిక్వెస్ట్..
Urvashi Rautela

Updated on: Jun 25, 2023 | 2:03 PM

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఇటీవల కాలంలో నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది. వ్యక్తిగత విషయాల నుంచి.. మూవీ అప్డేట్స్ వరకు ప్రతి విషయంలోనూ ఊర్వశి సంచలనమే. బాస్ పార్టీ అంటూ మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులేసిన ఈ చిన్నది.. ఆ తర్వాత ఏజెంట్ చిత్రంలోనూ చిందులేసింది. ఇక రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న ఈ సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. అయితే కొద్ది రోజులుగా క్రికెటర్ పంత్‏పై సోషల్ మీడియాలో పోస్ట్స్ చేసి అందరిని దృష్టి ఆకర్షించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరో ఆసక్తికర పోస్ట్ చేసింది. విమానంలో తన ఐఫోన్స్ మర్చిపోయానని.. వాటిని వెతికేందుకు సాయం చేయాలని కోరింది.

“డియర్ విస్తారా.. నేను నా రెండు ఐఫోన్లను యూకే 772 విమానంలో మర్చిపోయాను. వాటి వాల్ పేపర్ గా నా పేరెంట్స్ ఫోటో ఉంటుంది. దయచేసి దాన్ని వెతికేందుకు సహయం చేస్తారా ” అంటూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

Urvashi

ఇదిలా ఉంటే.. ఇటీవల ఆమె నటించిన ఇన్ స్పెక్టర్ అవినాష్ ఓటీటీ వేదికగా మే 18న విడుదలైంది. ఇక ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న బ్రో చిత్రంలోనూ నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us