ఇటీవలే ఎఫ్ 3 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తమన్నా (Thamannah).. ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. బాలీవుడ్, టాలీవుడ్ తేడా లేకుండా స్టోరీ నచ్చితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మిల్కీబ్యూటీ మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్, హిందూలో భోలే చుడియాన్ చిత్రాల్లో నటిస్తోంది. ఇక మరోవైపు ఫీమెల్ ఓరియంటెడ్ నేపథ్యంలో ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం బబ్లీ బౌన్సర్. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇక మరోవైపు బబ్లీ బౌన్సర్ సెప్టెంబర్ 23న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గోంటున్న తమన్నా.. తన మనసులోని మాటలను బయటపెట్టేసింది.
ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో మీకు మళ్లీ ఏ హీరోతో నటించాలని ఉందని రిపోర్టర్లు ప్రశ్నించగా.. తనకు బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తో కలిసి నటించాలని ఉందని తెలిపింది. వీరిద్దరు హమ్షకల్ (Humshakals) చిత్రంలో నటించారు. ఈ సినిమా 2014లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక అలాగే మెగాస్టార్ సరసన నటిస్తోన్న భోళా శంకర్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అలాగే సత్యదేవ్, తమన్నా కలిసి నటించిన గుర్తుందా శీతాకాలం మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లి్క్ చేయండి.