ఆ షో వల్ల నా కెరీర్ నాశనం అయ్యింది.. నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడుకున్నారు

కొంతమంది ముద్దుగుమ్మలు సినిమాలతో పాటు టీవీ షోల్లోనూ పాల్గొంటూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. చాలా మంది భామలు సినిమాలు తగ్గించి టీవీ షోలతో గేమ్ షోలతో బిజీ అవుతున్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. కానీ ఓ గేమ్ షో వల్ల తన కెరీర్ నాశనము అయ్యిందని చెప్పి షాక్ ఇచ్చింది.

ఆ షో వల్ల నా కెరీర్ నాశనం అయ్యింది.. నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడుకున్నారు
Actress

Updated on: Mar 26, 2026 | 11:33 AM

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన చాలా మంది ఇప్పుడు సినిమాల్లో హీరోలుగా, హీరోయిన్స్ గా సినిమాలు చేసి ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. కొంతమంది ముద్దుగుమ్మలు మాత్రం హీరోయిన్స్ గా సక్సెస్ అవ్వలేక సతమతం అవుతున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో అందంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి గ్లామరస్ ఫోటోలకు ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కుర్రకారు ఈ చిన్నది ఎప్పుడెప్పుడు ఫోటోలు షేర్ చేస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఓ గేమ్ షో వల్ల తన కెరీర్ నాశనం అయ్యిందని. తనకు ఉన్న క్రేజ్ కూడా పోయిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

OTT Movie: ఈ సినిమాలో సీన్స్ ఉంటాయి భయ్యా..! ట్విస్ట్‌లతో పిచ్చెక్కిపోద్ది..

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఫెమస్ అయ్యింది తేజస్వి మాదివాడ. ఆతర్వాత నితిన్ హీరోగా నటించిన హార్ట్ ఎటాక్ సినిమాలోనూ నటించింది. ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో సోలో హీరోయిన్ గా నటించినా, ఆ తర్వాత సెకెండ్ ఫీమెల్ లీడ్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఎక్కువగా కనిపించింది.బిగ్ బాస్ హౌజ్ లో అడుగు పెట్టి బుల్లితెర ఆడియెన్స్‌కు చేరువైన తేజస్వి మదివాడ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో పాల్గొంది ఈ అమ్మడు. తన ఆటతో ప్రేక్షకులను అలరించింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడు సినిమాల్లో బిజీ అవుతుందని అంతా అనుకున్నారు.. కానీ అలా జరగలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు కూడా సోషల్ మీడియాలో ఫోటోలు, రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తేజస్వి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇవి కూడా చదవండి

మనిషి చాలా మంచోడే కానీ అది ఒక్కటే చెడ్డ అలవాటు.. స్టార్ నటుడి గురించి శివాజీ రాజా

చాలా మంది బిగ్ బాస్ లోకి వెళ్లాలని ఆరాటపడుతున్నారు.. అక్కడ జరిగేది ఒకటి మనకు చూపించేది మరొకటి. బిగ్ బాస్ చూసిన జనాలు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. మా గురించి పిచ్చుపిచ్చిగా మాట్లాడుకుంటుంటారు.. చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. దాంతో దర్శకనిర్మాతలు మాకు ఛాన్స్ లు ఇవ్వడానికి వెనకడుతారు. బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొనడం వల్లే నా కెరీర్ నాశనం అయ్యింది అని తెలిపింది తేజస్వి. ఇక బిగ్ బాస్ లోకి వెళ్లే గురించి మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఫెమస్ అవ్వడమేమో కానీ ఉన్న ఫేమ్ పోతుంది అని తేజస్వి చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us