Samantha-Tamannaah: సమంతకు అండగా మిల్కీబ్యూటీ.. ఆ విషయంలో షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా..
మహిళా దినోత్సవానికి ముందు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. నటీనటులు ఎదుర్కొనే బాడీ షేమింగ్ కామెంట్స్ పై స్పందించింది. ఈ క్రమంలోనే హీరోయిన్ సమంత అందం.. మయోసైటిస్ సమస్యపై వచ్చిన ట్రోల్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
వెండితెరపైనే కాదు.. ఓటీటీలోనూ సూపర్ హిట్ చిత్రాలతో సినీ ప్రియులను అలరిస్తోంది మిల్కీబ్యూటీ తమన్నా. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో హీరోయిన్ కీర్తి సురేష్ చిరు చెల్లిగా కనిపించనుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే అటు హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టింది తమన్నా. ఇదిలా ఉంటే.. ఇటీవల కొద్దిరోజులుగా తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రూమర్స్ పై ఇప్పటివరకు మిల్కీబ్యూటి స్పందించలేదు. మహిళా దినోత్సవానికి ముందు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. నటీనటులు ఎదుర్కొనే బాడీ షేమింగ్ కామెంట్స్ పై స్పందించింది. ఈ క్రమంలోనే హీరోయిన్ సమంత అందం.. మయోసైటిస్ సమస్యపై వచ్చిన ట్రోల్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
కోవిడ్ సమయంలో కాస్త బరువు పెరగడంతో గతంలో తమన్నాను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు నెటిజన్స్. ఇదే విషయాన్ని మరోసారి గుర్తుచేసుకుంది మిల్కీబ్యూటీ. “ఒక మహిళకు ఇది చాలా కష్టం. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండేవారికి ఇలాంటి కామెంట్స్ మరింత బాధిస్తాయి. మేము నిత్యం ప్రజలలో ఉండే వ్యక్తులము. మాకు సంబంధించిన ప్రతి విషయాన్ని జనాలతో పంచుకుంటాము. మా గురించి ప్రజల అభిప్రాయం.. వారు మన గురించి ఒక నిర్ణయానికి రావాలని మేము కోరుకుంటాము. కానీ మేము సెలబ్రెటీ కావడం వలన ప్రతి ఒక్కరు మా గురించి ఏమని ఆలోచిస్తున్నారనేది తెలుసుకోవడం చాలా కష్టం. కొన్నిసార్లు సోషల్ మీడియాలో మాపై వచ్చే ట్రోల్స్ చాలా అసహ్యంగా ఉంటాయి. మేము ఎక్కడ ఎలా ఉన్నా ప్రశాంతంగా ఉండాలనుకుంటాము. కాబట్టి మా గురించి ఇతరుల అభిప్రాయాలు..వారి కామెంట్స్ వింటూ ముందుకెళ్లాల్సిందే” అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.
అలాగే తమన్నా మాట్లాడుతూ.. “నువ్వు నీవే .. నువ్వు ఇతరుల మాదిరిగా కనిపించాల్సిన అవసరం లేదు. యూత్.. పెద్దవారి ఆలోచనలను తెలుసుకుంటున్నాను. నేనేప్పుడు మరొకరిలా ఉండాలని ప్రయత్నించను. మన గుర్తింపు అనేది మన సైజ్, ఆకారం బట్టి రాదు. ” అని తెలిపింది.