Sreemukhi: అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘జులాయి’ చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది శ్రీముఖి. ఇక అనంతరం ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో హీరోయిన్‌గాను మెప్పించిందీ అమ్మడు. ఓవైపు అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే మరోవైపు యాంకర్‌గా రాణించింది. సినిమా ప్రీ రిలిజ్ ఈవెంట్స్, ఆడియో వేదికల్లో సందడి చేస్తూ దూసుకుపోతోందీ చిన్నది. ఇదిలా ఉంటే శ్రీముఖి తాజాగా ‘క్రేజీ అంకుల్స్’ అనే మరో సినిమాతో ఆకట్టుకోవడానికి వస్తోంది. శ్రీముఖి ప్రధాన పాత్రగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెల 19న విడుదల చేయనున్నారు. దీంతో సినిమా ప్రచారకార్యక్రమంలో పాల్గొంటున్న శ్రీముఖి.. పలు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 31 ఏళ్ల వయసులో వివాహం చేసుకోనున్నట్లు తెలిపి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా మరో ఇంటర్వ్యూలో తాను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న కష్టాలను ఏకరువుగా పెట్టింది. కెరీర్‌లో స్థిరపడే క్రమంలో ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పింది శ్రీముఖి. యాంకరింగ్ మొదలు పెట్టిన సమయంలో చాలా ఇబ్బందిగా అనిపించేదని చెప్పిన ఈ ముద్దుగుమ్మ.. షూటింగ్ చేసే సమయంలో చాలాసేపు నిలబడి ఉండాల్సి వచ్చేదని తెలిపింది. కొన్ని షోలలో అయితే నిలబడి, నిలబడి కాళ్లు తిమ్మిర్లు కూడా వచ్చేవని తెలిపింది. ఒకానొక సమయంలో ఉదయం 7 గంటలకు ఇంటిలో నుంచి బయటకు వెళితే.. మళ్లీ మరుసటి రోజు ఉదయం 7 గంటలకు ఇంటికి చేరుకున్నానని చెప్పుకొచ్చింది. అసలు ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చానా అని ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలిపిన శ్రీముఖి.. అయితే తన నాన్న ఇచ్చిన ధైర్యంతోనే వాటన్నింటినీ అధిగమించానని చెప్పింది. ఆ కష్టాలను అధిగమించి ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పుకొచ్చిందీ ఈ అమ్మడు. ఇక తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న ‘క్రేజీ అంకుల్స్’ శ్రీముఖి కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.
Also Read: Trailer Talk: రౌడీలకు రామాయణం చెబితే రావణాసురిడినే ఫాలో అవుతారు.. దుమ్ములేపుతున్న బర్నింగ్ స్టార్.
SR Kalyana Mandapam: ఆహాలో సందడి చేయనున్న ఎస్‌ఆర్. కళ్యాణ మండపం.. ఈ నెలలోనే స్ట్రీమింగ్ మొదలు..?