మాస్ మహారాజా రవితేజ (Raviteja) ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నాడు. ఇటీవల ఖిలాడి (Khiladi) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మాహారాజ్ మంచి టాక్ సంపాదించుకున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులనుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గానటించారు. ఈ సినిమానే కాకుండా.. ప్రస్తుతం రవితేజ చేతిలో మరో రెండు చిత్రాలున్నాయి. అందులో ధమాకా (Dhamaka).. రావణసుర చిత్రాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రాల నుంచి విడుదలై పోస్టర్స్ ధమాకా.. రావణసుర సినిమాలపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా రవితేజ నటిస్తోన్న ధమాకా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ రివీల్ చేశారు మేకర్స్.
తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా కాసేపటి ధమాకా నుంచి స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. ఇందులో రవితేజ సరసన పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. ధమాకా నుంచి సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇందులో శ్రీలీలా ప్రణవి పాత్రలో కనిపించనుంది. తాజాగా విడుదలైన పోస్టర్లో ఓ గొడపై శ్రీలీల కూర్చుని స్నాక్స్ తింటుండగా.. రవితేజ ఆమెకు ఏదో విషయాన్ని వివరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరిస్తున్నారు.
Introducing the adorable @sreeleela14 as ‘Pranavi’ from #Dhamaka on this #Valentinesday
Everyone dreams of having a VALENTINE Like her?@RaviTeja_offl @vishwaprasadtg @TrinadharaoNak1 @KumarBezwada @peoplemediafcy @AAArtsOfficial @vivekkuchibotla @sujithkolli @THEOFFICIALB4U pic.twitter.com/Yp2fl5U6ii
— People Media Factory (@peoplemediafcy) February 14, 2022
Viral Video: కోతా మజాకా.. చిరుతపులిని ముప్పు తిప్పలు పెట్టిందిగా.. చివరకు.
Actor Photo: ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువ..