Sreeleela: గొప్పగొప్ప హీరోయిన్లే ఆ పని చేశారు.. నేనెంత.. శ్రీలీల ఆసక్తికర కామెంట్స్

కన్నడలో సినిమాలు చేస్తూ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న శ్రీలీల ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తుంది. ఇప్పటికే పలు సినిమాల్లో ఛాన్స్ దక్కించుకున్న ఈ బ్యూటీ

Sreeleela: గొప్పగొప్ప హీరోయిన్లే ఆ పని చేశారు.. నేనెంత.. శ్రీలీల ఆసక్తికర కామెంట్స్
Shreeleela
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 22, 2022 | 3:51 PM

ఒకే ఒక్క సినిమాతో క్రేజ్ సొంతం చేసుకున్న బ్యూటీలు చాలా  మంది ఉన్నారు. వారిలో శ్రీలల ఒకరు. పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది. కన్నడలో సినిమాలు చేస్తూ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న శ్రీలీల ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తుంది. ఇప్పటికే పలు సినిమాల్లో ఛాన్స్ దక్కించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజతో కలిసి ధమాకా సినిమాలో చేస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది . ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ మూవీలో పాటలు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ధమాకా సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

శ్రీలీల మాట్లాడుతూ.. షూటింగ్ లో రవితేజగారిని మ్యాచ్ చేయడానికి చాలా కష్టపడ్డా అని తెలిపింది శ్రీలీల. అలాగే ఆయన నుంచి చాలా నేర్చుకున్నా అని చెప్పుకొచ్చింది శ్రీలీల. ఇక ఈ సినిమా దర్శకుడు త్రినాద్ రావు నక్కిన గతంలో తెరకెక్కించిన హలొ గురు ప్రేమకోసమే సినిమాలో ఛాన్స్ దక్కిందని కానీ అప్పుడు రిజక్ట్ చేశానని తెలిపింది శ్రీలీల.

‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రంలో ఓ రోల్ కోసం నన్ను సంప్రదించారు. అదే టైంలో రైటర్ ప్రసన్న గారు కూడా పరిచయమయ్యారు. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయాను. కానీ పెళ్ళిసందడి సినిమా అయిపోయిన వెంటనే ధమాకా కథ విని ఓకే చెప్పేశా.. అని తెలిపింది. అలాగే ఏజ్ గురించి వస్తున్న ట్రోల్స్ పై స్పందిస్తూ .. నాకంటే గొప్ప గొప్ప హీరోయిన్లు స్టార్ హీరోలతో నటించేప్పుడు.. ఏజ్ గురించి పట్టించుకోలేదు. నేను ఎంత చెప్పండి. పైగా రవితేజ గారి ఎనర్జీ చూస్తే నాకంటే చిన్న వయసున్న వ్యక్తి అనిపిస్తుంది. అందుకనే ఏజ్ గురించి ట్రోలింగ్ చేస్తే నేను పట్టించుకోను అని తెలిపింది.

ఇవి కూడా చదవండి
సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుపై జీఎస్టీ బాదుడు.. ఎంత పెంచారంటే..?
సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుపై జీఎస్టీ బాదుడు.. ఎంత పెంచారంటే..?
చలికాలంలో పచ్చిబఠానీలు తింటే ఆరోగ్యానికి కలిగేప్రయోజనాలు తెలిస్తే
చలికాలంలో పచ్చిబఠానీలు తింటే ఆరోగ్యానికి కలిగేప్రయోజనాలు తెలిస్తే
తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారంటే..?
తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారంటే..?
ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం.. హాజరైన సీఎం చంద్రబాబు..
ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం.. హాజరైన సీఎం చంద్రబాబు..
Gold Rates in 2025: పసిడి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?
Gold Rates in 2025: పసిడి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?
శ్రీ తేజ్‌కుటుంబానికి అండగా వేణు స్వామి.. 2 లక్షల ఆర్థిక సాయం
శ్రీ తేజ్‌కుటుంబానికి అండగా వేణు స్వామి.. 2 లక్షల ఆర్థిక సాయం
వారానికి ఒక గ్లాస్‌ చెరకు రసం తాగితే చాలు..!అద్భుతమైన ప్రయోజనాలు
వారానికి ఒక గ్లాస్‌ చెరకు రసం తాగితే చాలు..!అద్భుతమైన ప్రయోజనాలు
ఇది సార్ టాలీవుడ్ రూలు.. బాలీవుడ్‎ని ఏలేస్తున్న తెలుగు హీరోలు..
ఇది సార్ టాలీవుడ్ రూలు.. బాలీవుడ్‎ని ఏలేస్తున్న తెలుగు హీరోలు..
ఎన్టీఆర్ కథ లీక్ చేసిన దర్శకుడు..
ఎన్టీఆర్ కథ లీక్ చేసిన దర్శకుడు..
ఆ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మతిపోయే బహుమతులు అందజేత
ఆ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మతిపోయే బహుమతులు అందజేత