Sonal Chauhan : నా పాత్ర అందుకే ట్రైలర్ లో చూపించలేదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన సోనాల్

|

May 13, 2022 | 9:04 PM

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎఫ్ 3..  స్టార్ ప్రోడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

Sonal Chauhan : నా పాత్ర అందుకే ట్రైలర్ లో చూపించలేదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన సోనాల్
Sonal Chauhan
Follow us on

విక్టరీ వెంకటేష్(Venkatesh), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎఫ్ 3..  స్టార్ ప్రోడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఎఫ్3తో థియేటర్లలో నవ్వులు పంచడానికి సమ్మర్ సోగ్గాళ్ళుగా రాబోతున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. థియేటర్ లో నవ్వులు పండగ తీసుకురాబోతున్న ఎఫ్3 లో వెంకటేష్ కు జోడిగా తమన్నా, వరుణ్ తేజ్ కు జోడిగా మెహ్రీన్ సందడి చేయబోతున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ సోనాల్ చౌహాన్(Sonal Chauhan)కూడా కీలక పాత్ర పోషించారు. తాజాగా ఎఫ్ 3తో పాటు తన పాత్రకు సంబధించిన విశేషాలు సోనాల్ చౌహన్ పంచుకున్నారు.

సోనాల్ మాట్లాడుతూ.. ”ఎఫ్ 3” ప్రాజెక్ట్ లోకి రావడం వెనుక చాలా ఆసక్తికరమైన కథ వుంది అన్నారు. ”లెజెండ్” సినిమా జరుగుతున్నప్పుడే దర్శకుడు అనిల్ రావిపూడి గారితో పరిచయం. రామోజీ ఫిల్మ్ సిటీలో లెజెండ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో అనిల్ గారు వేరే సినిమా షూటింగ్ చేస్తున్నారు. అదే సమయంలో మాట్లాడుకున్నాం. కలసి వర్క్ చేయాలని అనుకున్నాం. ఐతే చాలా ఏళ్ల తర్వాత ఆయన నుండి ఫోన్ వచ్చింది. ‘ఎఫ్3 అనే సినిమా చేస్తున్నాను. ఓ పాత్ర కోసం మిమ్మల్ని అనుకుంటున్నాను” అన్నారు. మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. అనిల్ గారు కామెడీ కింగ్. అప్పటికే ఎఫ్ 2 సినిమా చూశాను. హిలేరియస్ మూవీ అది. ఎఫ్ 2కి మించిన ఫన్ ఎఫ్ 3లో వుంటుంది అని చెప్పుకొచ్చింది. ఎఫ్ 3లో నేను చేస్తున్న పాత్ర చాలా సర్ప్రైజింగా వుంటుంది అంటుంది సోనాల్. ట్రైలర్ లో కూడా సీక్రెట్ గా దాచిపెట్టాం. నా పాత్రలో ఒక ట్విస్ట్ వుంటుంది. ఆ ట్విస్ట్ రివిల్ అయినప్పుడు ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్టైన్ ఫీలౌతారు. ఎఫ్2 కంటే ఎఫ్ 3లో భారీ తారాగణం వుంది. అన్ని పాత్రలకు కథలో ప్రాధాన్యత వుంది. నా పాత్ర వరకూ వస్తే .. కథలో కీలకమైన పాత్రే. పైగా ఫుల్ లెంత్ కామెడీ సినిమా చేయడం నా కెరీర్ లో ఇదే మొదటిసారి. ఎఫ్ 3 లాంటి అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ చేయడం ఒక ఛాలెజింగా అనిపించింది.  ఎందుకంటె కామెడీ చేయడం అంత తేలిక కాదు అని చెప్పుకొచ్చింది సోనాల్.

ఇవి కూడా చదవండి

Hebah Patel: క్లాస్ లుక్ లో హెబ్బా పటేల్.. చూడముచ్చటగా ఉందంటున్న ఫ్యాన్స్

Bhala Thandhanana: విడుదలైన 20 రోజులకే ఓటీటీలోకి.. భళ తందనాన స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Anasuya Bharadwaj: ఖతర్నాక్ ఫోజులతో కవ్విస్తున్న అను.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్