అతనికి ప్రపోజ్ చేస్తే నో చెప్పాడు.. షాకింగ్ విషయం చెప్పిన సిరి హనుమంతు

విశాఖపట్నంలో పుట్టి పెరిగిన సిరి పలు అందాల పోటీల్లో పాల్గొంది. ఆ తర్వాత న్యూస్ యాంకర్ గా, ఆపై నటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఎవరే నువ్వు మోహిని, సావిత్రమ్మగారి అబ్బాయి, అగ్నిసాక్షి తదితర సీరియల్స్‌లో నటించి మెప్పించిన సిరి ఇద్దరి లోకం ఒకటే, నరసింహపురం, ఓరేయ్ బుజ్జిగా, బూట్ కట్ బాలరాజు తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది.

అతనికి ప్రపోజ్ చేస్తే నో చెప్పాడు.. షాకింగ్ విషయం చెప్పిన సిరి హనుమంతు
Siri

Updated on: Jan 16, 2026 | 11:49 AM

సినిమాలు, టీవీ షోలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న నటీమణుల్లో సిరి హనుమంతు ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది సిరి హనుమంతు. ఈ ముద్దుగుమ్మ పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అందాల భామ. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొంది ఈ వయ్యారి. బిగ్ బాస్ లో తన అందం, ఆట తీరుతో ప్రేక్షకులను కట్టిపడేసింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు సినిమాల్లో నటిస్తుంది ఈ చిన్నది. రీసెంట్ గా నారీ నారీ నడుమ మురారి అనే సినిమాలో నటించింది. కాగా సిరి హనుమంతు గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, ప్రేమ కథ,అలాగే కుటుంబం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. సిరి హనుమంతు కెరీర్ బిగినింగ్ లో  న్యూస్ రీడర్‌గా చేసింది, ఆ తర్వాత ప్రముఖ ఛానెల్ లో జిల్ జిల్ జిగా అనే కాలేజ్ షోతో యాంకర్‌గా మారింది. ఈ షోలో ఆమెను చూసి, మరో ఛానెల్ లో కొత్త సీరియల్స్ లో అవకాశం వచ్చింది. ఆతర్వాత వరుసగా సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావిస్తూ, సిరి తన ప్రేమ కథను తెలిపింది. షార్ట్ ఫిలింస్ చేసే సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

తన ప్రియుడు శ్రీహాన్ మొదట ప్రపోజ్ చేయడానికి ఆలోచించడాని, తనే చొరవ తీసుకుని ఆర్.కే. బీచ్‌లో ప్రపోజ్ చేసినట్లు చెప్పింది. అయితే,  శ్రీహాన్ మొదట తన ప్రపోజల్‌కు నో చెప్పాడని, దీనికి కారణం తను ముస్లిం, సిరి హిందువు కావడమే అని తెలిపింది. ఇరు కుటుంబాల ఆమోదం లభించకపోవచ్చు, అలాగే పెళ్లి చేసుకోకుండా మధ్యలో రిలేషన్ బ్రేక్ అయితే అది సిరిని మోసం చేసినట్లు అవుతుందని అతను భావించి నో చెప్పాడట. అప్పుడు తనకు 19 సంవత్సరాలని, తాను చాలా మొండిదని, ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు నిద్రపట్టదని సిరి చెప్పుకొచ్చింది. ప్రపోజల్ కు నో చెప్పిన తర్వాత, సిరి ఒక వారం రోజుల్లో తన ప్రియుడే మళ్లీ ప్రపోజ్ చేసేలా చేస్తానని సవాలు చేసిందట. ఆతర్వాత సిరి అతనితో మాట్లాడటం మానేసిందట. వారం రోజులు ఆమెతో మాట్లాడకపోవడంతో, సిరి విలువను అర్థం చేసుకున్న ప్రియుడు, తాను సిరిని ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి ప్రపోజ్ చేశాడని చెప్పుకొచ్చింది. ఇక ఇంట్లో వాళ్లుకు కూడా శ్రీహన్ తెలుసు కాబట్టి ఒప్పుకున్నారని తెలిపింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..