
చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. హిందీలో పలు చిత్రాల్లో బాలనటిగా కనిపించి మెప్పించింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ సక్సెస్ అయ్యింది. తెలుగులో ఫస్ట్ మూవీతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలతో బిజీ కావాల్సిన అమ్మాయి.. అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు ఒక్క పొరపాటుతో ఇండస్ట్రీకి దూరమయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్, కెరీర్ విషయాలు వెల్లడించింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మరెవరో కాదు.. శ్వేత బసు ప్రసాద్. కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి చిత్రంతోనే అందం, నటనతో అందరిని తనవైపు తిప్పుకుంది. ఫస్ట్ సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..
ఆ తర్వాత మాత్రం తన క్రేజ్ కాపాడుకోలేకపోయింది. తెలుగులో ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత కొన్ని వివాదాల్లో చిక్కుకుని ఇండస్ట్రీకి దూరమయ్యింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఓటీటీలో సినిమాలు, సిరీస్ లు చేస్తుంది. ఇటీవలే మహారాణి వెబ్ సిరీస్ నాలుగో సీజన్ లో కనిపించిన ఈ అమ్మడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్పుడు తాను ఏదోక ప్రాజెక్ట్ చేస్తున్నానని.. అలా అని వచ్చిన ప్రతి అవకాశానికి ఓకే చెప్పడం లేదని అన్నారు. ప్రేక్షకులపై తనకు నమ్మకం ఉందని అన్నారు.
ఇవి కూడా చదవండి : Shhyamali De: నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. నా బాధను అర్థం చేసుకోండి.. రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్..
తనకు పది ప్రాజెక్టులో దాదాపు తొమ్మిదిని రిజెక్ట్ చేస్తున్నా… దాని వల్ల ఆరు నెలలు ఇంట్లో ఖాళీగా కూర్చొన్నా పర్లేదు. కానీ సరైన అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాను. నా జీవితంలో పెద్దగా ఖర్చులు లేవు. పార్టీలకు కూడా వెళ్లను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్వేత ప్రసాద్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Actress : ఆ పని నేను చేయలేదు.. అందుకే నాకు ఆఫర్స్ రావడం లేదు.. హీరోయిన్ స్నేహా ఉల్లాల్..