Shruti Haasan: కరోనా బారిన పడ్డ హీరోయిన్.. ఆందోళనలో సలార్ చిత్రయూనిట్..

|

Feb 27, 2022 | 2:52 PM

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఇటీవల గణనీయంగా పెరిగిన కోవిడ్ కేసులు.. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి.

Shruti Haasan: కరోనా బారిన పడ్డ హీరోయిన్.. ఆందోళనలో  సలార్ చిత్రయూనిట్..
Shruti Haasan
Follow us on

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఇటీవల గణనీయంగా పెరిగిన కోవిడ్ కేసులు.. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ మహామ్మారి బారీన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ (Shruti Haasan) కరోనా బారీన పడింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కోవిడ్ పాజిటివ్ వచ్చింది.. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నానని.. త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటానని చెబుతూ శ్రుతి హాసన్ పోస్ట్ చేశారు. కరోనా థర్డ్ వేవ్ సమయంలో శ్రుతి హాసన్ తండ్రి కమల్ హాసన్ కూడా కోవిడ్ బారీన పడిన సంగతి తెలిసిందే. కమల్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు శ్రుతి హాసన్ తన ఇన్ స్టా ద్వారా అభిమానులకు తెలియజేశారు.

మాస్ మాహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చింది శ్రుతి హాసన్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా.. శ్రుతి హాసన్ మరోసారి తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ మూవీ తర్వాత శ్రుతికి వరుస ఆఫర్లు తలుపుతట్టాయి. ప్రస్తుతం శ్రుతి.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న సలార్ సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆద్య పాత్రలో కనిపించనుంది శ్రుతి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన శ్రుతి హాసన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతోపాటు.. బాలకృష్ణ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది.

Also Read: Ajith Valimai: బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వలిమై.. ఆ స్టార్ హీరో సినిమాలను అజిత్ మూవీ బీట్ చేసిందట..

Chiranjeevi : గ్యాంగ్‌లీడర్‌ మార్క్ మసాలా ఎంటర్‌టైనర్‌‌తో రానున్న మెగాస్టార్..?

Kodali Nani: బాబును వదిలి అన్నను నమ్ముకో.. పవన్ కల్యాణ్‌కు కొడాలి నాని సూచన..

Prakash Raj: చిత్రపరిశ్రమను క్షోభపెడుతూ ప్రోత్సాహిస్తున్నామంటే నమ్మాలా ?.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్..