Shruthi Haasan: తన వయసుపై ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్రుతి హాసన్.. అస్సలు ఫీల్ కానంటూ..

|

Jan 23, 2022 | 9:21 AM

ప్రముఖ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రుతి హాసన్. అయితే మొదటి సినిమాలో

Shruthi Haasan: తన వయసుపై ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్రుతి హాసన్.. అస్సలు ఫీల్ కానంటూ..
శ్రుతి హాసన్ సొగసులు..
Follow us on

ప్రముఖ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రుతి హాసన్. అయితే మొదటి సినిమాలో నటన పరంగా మంచి మార్కులు తెచ్చుకున్నప్పటికీ ఆ మూవీ అంతగా హిట్ కాలేకపోయింది. ఇక ఆ తర్వాత వరుస ప్లాపులతో నెట్టుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో హిట్ అందుకుంది శ్రుతి. ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అయితే కొద్ది కాలం సినిమాలకు దూరంగా ఉన్న శ్రుతి హాసన్.. ఇటీవల రవితేజ నటించిన క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ప్రభాస్.. ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా సలార్ లో నటిస్తోంది. అలాగే గోపిచంద్ మలినేని.. నందమూరి నటసింహం కాంబోలో రాబోతున్న మూవీలోనూ శ్రుతి హాసన్ నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. జనవరి 28న శ్రుతి హాసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో తన వ్యక్తిగత విషయాలతోపాటు.. కెరీర్ గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేసింది. శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. సింగం సినిమా చేస్తున్నప్పుడు నేను సంగీతం పరంగా చదువుకున్నాను.. నటన పరంగా ఏమి చేయలేదనే ఆలోచన వచ్చింది. లండన్ వెళ్లి కోర్సులో ప్రవేశించా. అప్పటినుంచి నేను సినిమాని చూసే కోణమే మారిపోయింది. ఒక పాత్రను అర్థం చేసుకునే విధానంలోనూ చాలా మార్పులొచ్చాయి. సెవెన్త్ సెన్స్ సినిమా కోసం మురుగాదాస్ గారితో కలిసి ప్రయాణం చేసిన సమయంలో నటిగా నాపై నాకు నమ్మకం వచ్చింది. ఆ సినిమా కథ విన్నాక నేను చేయగలనా అని భయపడుతూ చెప్పా. ఆయనకు నాకు నమ్మకం ఉంది. మరీ నీకెందుకు లేదు అని అడిగారు. ఆ మాట నాపై బాధ్యతను పెంచింది. దర్శకులు నన్ను నమ్మితే ఇంకా బాగా పనిచేస్తానని ఆ సినిమాతో అర్థమైంది. అప్పటి నుంచి నన్ను నేను నమ్మి అడుగేయడం అలవాటైంది. నన్ను మొదట స్వీకరించింది తెలుగు ప్రేక్షకులే. అందుకే తెలుగులో నటించడం ప్రత్యేకంగా భావిస్తాను అంటూ చెప్పుకొచ్చింది.

ఇక వయసు గురించి మాట్లాడుతూ.. ఎంత దాచిన దాగదు అని.. వయసుకు తగ్గట్టుగా మనుషులు మారుతుంటారు. శారీరకంగా నాలోనూ పెద్ద ఎత్తున మార్పులు వచ్చినా నేనేం ఫీల్ అయ్యేదాన్ని కాదు. వయసులో ఉన్న అందం అదే కదా. దాన్ని నిజాయితీగా స్వీకరించాలి. కాకపోతే నేను ఆరోగ్యకరమైన జీవనశైలిని బలంగా నమ్ముతాను. మనషుల కంటే మనసులు యవ్వనంగా ఉండాలనేది నా సిద్ధాంతం అంటూ చెప్పుకొచ్చింది.

Also Read: Priyamani: సెకండ్ ఇన్నింగ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ‘ప్రియమణి’ ఆకట్టుకుంటున్న ఫొటోస్…

Harish Shankar : ‘అబ్బా చింపేశావ్ అన్నయ్యా.. నిజానికి  పిండేశావ్’.. హరీష్ శంకర్ ఆసక్తికర ట్వీట్

Aa Ammayi Gurinchi Meeku Cheppali : ప్రిన్సెస్ లాంటి అమ్మాయి చుట్టూ తిరిగే కథ.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీజర్ వచ్చేసింది..