Chaitanya Master: నన్ను ఎంతగానో ఏడిపించారు.. చైతన్య మాస్టర్ మరణం పై నటి శ్రద్దాదాస్ ఎమోషనల్

|

May 01, 2023 | 11:35 AM

ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న ఢీ అనే డాన్స్ షోలో డాన్స్ మాస్టర్ గా చేస్తోన్న చైతన్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను రిలీజ్‌ చేశాడు చైతన్య. అందులో తన సూసైడ్‌కు గల కారణాలను వివరంగా చెప్పుకొచ్చాడతను. కాగా కొరియోగ్రాఫర్‌గా ఎంతో భవిష్యత్‌ ఉందనుకున్న చైతన్య హఠాత్తుగా సూసైడ్‌కు పాల్పడడం అందరినీ కలిచివేసింది.

Chaitanya Master: నన్ను ఎంతగానో ఏడిపించారు.. చైతన్య మాస్టర్ మరణం పై నటి శ్రద్దాదాస్ ఎమోషనల్
Chaitanya Master
Follow us on

ఇటీవల టాలీవుడ్ లో వరుస మరణాలు ప్రేక్షకులను షాక్ కు గురిచేస్తున్నాయి. ఇప్పటికే చాలా మందిప్రతిభావంతులను కోల్పోయిన ఇండస్ట్రీ రీసెంట్ గా ఓ డాన్స్ మాస్టర్ ను కోల్పోయింది. ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న ఢీ అనే డాన్స్ షోలో డాన్స్ మాస్టర్ గా చేస్తోన్న చైతన్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను రిలీజ్‌ చేశాడు చైతన్య. అందులో తన సూసైడ్‌కు గల కారణాలను వివరంగా చెప్పుకొచ్చాడతను. కాగా కొరియోగ్రాఫర్‌గా ఎంతో భవిష్యత్‌ ఉందనుకున్న చైతన్య హఠాత్తుగా సూసైడ్‌కు పాల్పడడం అందరినీ కలిచివేసింది. పలువురు ప్రముఖులు అతని మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. డ్యాన్స్‌ మాస్టర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే చైతన్య మాస్టర్ మరణం పై ప్రముఖ నటి శ్రద్దాదాస్ స్పందించింది.

తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్పందిస్తూ.. చైతన్య మరణం పై దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. చైతన్య మాస్టర్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది. జన్మించడం, మరణించడం ఎప్పుడు.? ఎందుకు? జరుగుతాయో తెలియవు. కానీ ఆ రెండింటి మధ్యలో మనం ఎలా బతికామన్నదే మనల్ని గొప్పవారిగా చేస్తుంది.. చైతన్య మాస్టర్‌ చాలా మంచి వ్యక్తి,  గొప్ప మనసున్న మనిషి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీరు నవ్వుతూ అందరినీ నవ్వించేవాళ్లు. కానీ ఈరోజు నన్ను ఎంతగానో ఏడిపించారు. మీ నవ్వు నాకెప్పటికీ గుర్తుండిపోతుంది’

అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు శ్రద్ధాదాస్. అప్పుల బాధ తట్టుకోలేక, తీవ్ర ఒత్తిడితోనే సూసైడ్‌ చేసుకుంటున్నట్లు ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను రిలీజ్‌ చేశాడు చైతన్య. తనకు డబ్బులు ఇవ్వాల్సిన వారు ఇవ్వలేదని దాంతో తాను అప్పులు చేసిన వారి నుంచి వేధింపు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు చైతన్య.

Shraddha Das