AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన హీరోయిన్.. ఆందోళనలో ఫ్యాన్స్

సినిమా షూటింగ్ లో హీరోలు గాయపడటం మనం చూస్తూ ఉంటాం.. యాక్షన్ సీన్స్ సమయంలో హీరోలకు గాయలవుతూ ఉంటాయి.

Tollywood : షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన హీరోయిన్.. ఆందోళనలో ఫ్యాన్స్
Movies
Rajeev Rayala
|

Updated on: Jul 28, 2022 | 2:53 PM

Share

సినిమా షూటింగ్ లో హీరోలు గాయపడటం మనం చూస్తూ ఉంటాం.. యాక్షన్ సీన్స్ సమయంలో హీరోలకు గాయలవుతూ ఉంటాయి. స్టార్ హీరోలంతా యాక్షన్ సీన్స్ కోసం కష్టపడి కాళ్లు, చేతులు విరగొట్టున్నవారే.. గాయాలైనా సరే సినిమాలో సీన్ పండాలని పట్టుదలతో మొండిగా చేస్తుంటారు హీరోలు. తాజాగా ఓ హీరోయిన్ కూడా షూటింగ్ లో తీవ్రంగా గాయపడింది. ఓ ఫైట్ సీన్ చేస్తున్న సమయంలో ఈ ముద్దుగుమ్మ గాయాలపాలైంది. అందం అభినయంతోనే కాదు ఇటీవల హీరోయిన్లు హీరోలకు సమానమైన పాత్రల్లోనూ నటిస్తున్నారు. హీరోల మాదిరిగా ఫైట్స్, యాక్షన్ సీన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ సంయుక్త హెగ్డే ప్రమాదానికి గురై తీవ్రగాయాలపాలైంది.

హీరోయిన్ సంయుక్త హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు యంగ్ హీరో నిఖిల్ నటించిన కిరాక్ పార్టీ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఈ సినిమా కన్నడ మూవీ కిరాక్ పార్టీ మూవీకి రీమేక్ గా వచ్చింది. ఈ సినిమా తర్వాత కాలేజ్ కుమార్ అనే సినిమాలో నటించింది సంయుక్త. అలాగే రీసెంట్ గా తెలుగు ఓటీటీ సంస్థ ఆహా లో రిలీజ్ అయిన డబ్బింగ్ మూవీ మన్మథ లీలలో నటించి మెప్పించింది ఈ అమ్మడు. తాజాగా సంయుక్త క్రీమ్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఫైట్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ లో రౌడీలను పై దాడి చేసే సీన్స్ లో సంయుక్త గాలిలోకి ఎగిరి నేలపై టైంకి లాండ్ అవలేక పోయింది.. దాంతో కింద పడిపోయింది. సంయుక్త కిందపడిపోవడంతో ఆమె కాలుకు తీవ్రగాయం అయినట్టు తెలుస్తోంది. చిత్రయూనిట్ ఆమెను వెంటనే హాస్పటల్ కు తరలించగా.. కొద్దిరోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారట వైద్యులు. సంయుక్తకు గాయమైన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె  త్వరగా కోలుకోవాలని ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి