AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sameera Reddy: హీరోయిన్ సమీరా రెడ్డి ఫ్యామిలీని చూశారా.. ? వైరలవుతున్న ఫోటోస్..

తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరోయిన్. కెరీర్ మొదట్లోనే మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, సూర్య వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తనే హీరోయిన్ సమీరా రెడ్డి. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ పూర్తిగా ఫ్యామిలీకి టైమ్ కేటాయించింది. తాజాగా ఆమె ఫ్యామిలీ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

Sameera Reddy: హీరోయిన్ సమీరా రెడ్డి ఫ్యామిలీని చూశారా.. ? వైరలవుతున్న ఫోటోస్..
Sameera Reddy
Rajitha Chanti
|

Updated on: Sep 03, 2025 | 7:59 PM

Share

ఒకప్పుడు తెలుగులో చక్రం తిప్పిన హీరోయిన్స్.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తక్కువ సమయంలోనే వరుస సినిమాలతో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తారలు.. ఇప్పుడు ఫ్యామిలీ టైమ్ గడిపేస్తున్నారు. అలాంటివారిలో ఈ హీరోయిన్ ఒకరు. తనే సమీరా రెడ్డి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో వరుస సినిమాల్లో నటించింది. అలాగే కోలీవుడ్ స్టార్ సూర్యతో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ చేసింది.కానీ ఇప్పుడు ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. 2005లో వచ్చిన నరసింహుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత చిరంజీవి నటించిన జై చిరంజీవా మూవీలో కనిపించింది. ఇందులో అమాయకంగా కనిపిస్తూనే గ్లామర్ బ్యూటీగా రచ్చ చేసింది. ఇక ఆ తర్వాత తమిళంలోనూ వరుస ఆఫర్స్ అందుకుంది. తక్కువ సమయంలోనే వరుస సినిమాలతో బిజీ ముద్దుగుమ్మగా మారిపోయింది.

ఇవి కూడా చదవండి : Tollywood : అప్పుడు బ్యాన్ చేశారు.. ఇప్పుడు వరుస ఆఫర్స్.. ఈ సీరియల్ బ్యూటీ క్రేజ్ చూస్తే..

ఇవి కూడా చదవండి

అయితే ఉన్నట్లుండి సినిమాలకు దూరమైపోయింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ముంబైకి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ వర్దేని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి పాప, బాబు ఉన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమీరా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా తన ఫ్యామిలీతో కలిసి వినాయక పూజ చేసినట్లు తెలుపుతూ తన ఫ్యామిలీ ఫోటోస్ పంచుకుంది. అందులో సమీరా రెడ్డి కూతురు, కొడుకు ఎంతో క్యూట్ గా ఉన్నారు.

ఇవి కూడా చదవండి :  Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన ఛాన్స్.. తెలుగులో క్యూ కట్టిన ఆఫర్స్..

ఇదిలా ఉంటే.. పెళ్లి తర్వాత పూర్తిగా బరువు పెరిగిపోయింది సమీరా. దీంతో ఆమె లుక్స్ పై నెట్టింట విపరీతమైన ట్రోల్స్ జరిగాయి. అయితే ఇటీవల తన ఫిట్నెస్ గురించి ఆసక్తికర వీడియో షేర్ చేసింది. అప్పట్లో తన బరువు 105 కేజీలకు పైగా ఉండేదని.. దీంతో తనను ట్రోల్స్ చేశారని తెలిపింది. జనాలు మంచి వాళ్లు.. ఏదైనా సరే మొఖం మీదే చెప్పేస్తారని.. ట్రోల్స్ తనను అంతగా బాధపెట్టలేదని తెలిపింది. జిమ్ కు వెళ్లకుండా ఇంట్లో పనులతోనే బరువు తగ్గినట్లు చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : OTT Movie: 25 కోట్ల బడ్జెట్.. ఆరేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది..

ఇవి కూడా చదవండి : Tollywood : అరె ఎంట్రా ఇది.. అప్పట్లో సెన్సేషన్ ఈ అమ్మడు.. ఇప్పుడు ఇలా.. ఎవరో గుర్తుపట్టారా.. ?

Follow Us