AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2012 నుంచి 2016 వరకు నంది ఫిల్మ్, టీవీ అవార్డులను అందించనున్నాం: ఎఫ్‌డీసీ చైర్మన్ పి. భరత్ భూషణ్

నంది అవార్డులపై ఎఫ్‌డీసీ చైర్మన్ పి. భరత్ భూషణ్ మాట్లాడుతూ.. గతంలో ప్రకటించిన 2012 నుంచి 2016 వరకు నంది ఫిల్మ్, టీవీ అవార్డులను అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 2017 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరానికి 4 అవార్డుల చొప్పున – 2 ప్రొడక్షన్, 2 స్పెషల్ జ్యూరీ అవార్డులు అందించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు.

2012 నుంచి 2016 వరకు నంది ఫిల్మ్, టీవీ అవార్డులను అందించనున్నాం: ఎఫ్‌డీసీ చైర్మన్ పి. భరత్ భూషణ్
Nandi Awards
Rajeev Rayala
|

Updated on: Sep 22, 2026 | 5:37 PM

Share

ఎఫ్‌డీసీ చైర్మన్ పి. భరత్ భూషణ్ మాట్లాడుతూ..  2025 సంవత్సరానికి కూడా నంది ఫిల్మ్, టీవీ అవార్డులను అందించేందుకు నిర్ణయం తీసుకున్నాం.. నంది ఫిల్మ్, జాతీయ చలనచిత్ర అవార్డులను అమరావతి లేదా విజయవాడలో నిర్వహించేందుకు నిర్ణయించాం.. నంది టీవీ అవార్డులను తిరుపతి వేదికగా అందించేందుకు నిర్ణయించాం. ఈ అవార్డులన్నింటినీ డిసెంబర్ 2026లోగా ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.

అలాగే అక్టోబర్‌లో నంది ఫిల్మ్, టీవీ అవార్డుల కోసం కమిటీలను ఏర్పాటు చేస్తాం.. నవంబర్‌లో అవార్డుల ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తామన్నారు. డిసెంబర్‌లో నంది ఫిల్మ్, టీవీ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలను నిర్వహిస్తామని తెలిపారు భరత్ భూషణ్. అదేవిధంగా నంది ఫిల్మ్ అవార్డుల్లో చలనచిత్రాలు, జాతీయ సమైక్యతపై చలనచిత్రాలు, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీ చిత్రాలు, విద్యా విషయక చిత్రాలు, తెలుగు సినిమాపై రచించిన ఉత్తమ రచనలు తదితర విభాగాలు ఉంటాయన్నారు. ఫిల్మ్ విభాగంలో మొత్తం 46 అవార్డులను అందించనున్నాం..

ఉత్తమ ప్రదర్శన, ద్వితీయ ఉత్తమ ప్రదర్శన, తృతీయ ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి తదితర విభాగాల్లో అవార్డులు అందిస్తాం. నంది ఫిల్మ్ అవార్డు గ్రహీతలకు బంగారు, వెండి, కాంస్య, తామ్ర నందులతో పాటు ప్రశంసాపత్రం, నగదు పారితోషికం అందిస్తాం.. వివిధ కేటగిరీలలో 8 గోల్డ్ మెడల్స్ కూడా అందించనున్నాం అని భరత్ భూషణ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

జాతీయ చలనచిత్ర అవార్డులు

ఎన్.టి.ఆర్. నేషనల్ ఫిల్మ్ అవార్డు – రూ.5 లక్షలు

బి.ఎన్. రెడ్డి నేషనల్ ఫిల్మ్ అవార్డు – రూ.2 లక్షలు

నాగిరెడ్డి–చక్రపాణి నేషనల్ ఫిల్మ్ అవార్డు – రూ.2 లక్షలు

రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు – రూ.2 లక్షలు

జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతలకు జ్ఞాపిక, సన్మాన పత్రంతో పాటు నగదు పారితోషికం అందిస్తామన్నారు.

అలాగే  టెలి చిత్రాలు, టీవీ ఫీచర్స్, టీవీ మెగా సీరియల్స్, టీవీ డైలీ సీరియల్స్, టీవీ బాలల చిత్రాలు, టీవీ డాక్యుమెంటరీ చిత్రాలు, టీవీ సామాజిక సంబంధిత చిత్రాలు, టీవీ విద్యా విషయక చిత్రాలు తదితర విభాగాల్లో అవార్డులు అందిస్తామన్నారు. టీవీ విభాగంలో మొత్తం 48 అవార్డులను అందించనున్నాం.. ప్రథమ, ద్వితీయ ఉత్తమ టెలి ఫిల్మ్, టెలి ఫీచర్స్, మెగా టీవీ సీరియల్, డైలీ టీవీ సీరియల్, టీవీ బాలల చిత్రం తదితర విభాగాల్లో అవార్డులు అందిస్తాం.. ఉత్తమ నటుడు, నటి, సహాయ నటుడు, హాస్య నటుడు, హాస్య నటి, ప్రతినాయకుడు, బాలల నటుడు, నటి, దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయిత తదితర విభాగాల్లో అవార్డులు అందించనున్నాం అని తెలిపారు. నంది టీవీ అవార్డు గ్రహీతలకు బంగారు, వెండి, కాంస్య, తామ్ర నందులతో పాటు ప్రశంసాపత్రం, నగదు పారితోషికం అందిస్తాం.. తెలుగు సినిమా, టెలివిజన్ రంగానికి చెందిన కళాకారులు, సాంకేతిక నిపుణులను గౌరవించడమే నంది అవార్డుల ప్రధాన ఉద్దేశ్యం అని భరత్ భూషణ్ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us