
స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. సమంత మయోసైటిస్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే.. సమంతకు మయోసైటిస్ అని తెలిసి ఆమె అభిమానులు షాక్ కు గురయ్యారు. విడాకుల విషయమే పెద్ద షాకింగ్ న్యూస్ అంటే.. ఆ వెంటనే మయోసైటిస్ తో బాధపడుతున్నా అని హాస్పటల్ లో ఫోటోను షేర్ చేసింది సామ్. దాంతో అభిమానులు గుండెలు బద్దలయ్యాయి. సామ్ త్వరగా కోలుకోవాలని పూజలు కూడా చేశారు ఫ్యాన్స్. సమంత చివరిగా విజయ్ దేవర కొండతో కలిసి ఖుషి అనే సినిమాలో నటించింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత మెంటల్ గా స్ట్రాంగ్ అవడానికి, అలాగే చికిత్స తీసుకోవడానికి ఒక ఏడాది బ్రేక్ తీసుకుంటున్నట్టు తెలిపింది సామ్.
అప్పటి నుంచి సామ్ రకరకాల ప్రదేశాలకు వెళ్తూ.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. సామ్ ఎప్పుడెప్పుడు తిరిగి సినిమాల్లోకి వస్తుందా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సామ్ తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా సామ్ కోలుకుంటుందని తెలుస్తుంది. తిరిగి సినిమాల్లో యాక్టివ్ అవ్వడానికి రెడీ అవుతుందని తెలుస్తోంది.
తాజాగా సమంత తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటున్నా అని తెలిపింది సామ్. తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో సామ్ మాట్లాడుతూ.. తిరిగి సినిమాల్లో ఎప్పుడు నటిస్తారు అని ఇప్పటికే చాలా మంది నన్ను అడుగుతున్నారు. ఫైనల్లీ ఆ టైం వచ్చేసింది. నేను అతి త్వరలో షూటింగ్స్‌లలో పాల్గొంటున్నాను. కొన్నిరోజుల పాటు నేనుఏ పని లేకుండా ఉనాన్ను. నా స్నేహితులతో కలిసి ఆరోగ్య పోడ్‌కాస్ట్‌పై ఒక కార్యక్రమం చేశాం అని తెలిపింది సామ్. ఈ వీడియో త్వరలోనే విడుదల అవుతుంది అనియు చెప్పుకొచ్చింది సమంత. సామ్ నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.