పిల్లలతో కలిసుండాలనుకున్నా.. రెండేళ్లుగా ఒంటరిగా ఉన్నా.. ఎమోషనల్ అయిన ఐశ్వర్య రజినీకాంత్

కొంతమంది సంతోషంగా పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటే చాలా మంది విడాకులు తీసుకుంటున్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. సమంత నాగ చైతన్య విడిపోయినప్పుడు చాలా మంది మ్యూచువల్ ఫ్యాన్స్ డీప్ గా ఫీల్ అయ్యారో. ఆతర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్, ధనుష్ విడిపోయినప్పుడు కూడా అభిమానులు అంతే ఫీల్ అయ్యారు. పెళ్లైన 18 ఏళ్లకు ఈ జంట విడిపోయి షాక్ ఇచ్చారు.

పిల్లలతో కలిసుండాలనుకున్నా.. రెండేళ్లుగా ఒంటరిగా ఉన్నా.. ఎమోషనల్ అయిన ఐశ్వర్య రజినీకాంత్
Aishwarya Rajinikanth
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 11, 2024 | 3:11 PM

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో విడాకుల హవా కనిపిస్తుంది. రోజుకొక జంట మేము విడిపోతున్నాం అంటూ వార్తల్లోకెక్కుతున్నారు. కొంతమంది సంతోషంగా పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటే చాలా మంది విడాకులు తీసుకుంటున్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. సమంత నాగ చైతన్య విడిపోయినప్పుడు చాలా మంది మ్యూచువల్ ఫ్యాన్స్ డీప్ గా ఫీల్ అయ్యారో. ఆతర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్, ధనుష్ విడిపోయినప్పుడు కూడా అభిమానులు అంతే ఫీల్ అయ్యారు. పెళ్లైన 18 ఏళ్లకు ఈ జంట విడిపోయి షాక్ ఇచ్చారు. అసలు ఎలాంటి రూమర్స్ లేకుండా సడన్ గా విడిపోతున్నాం అని సోషల్ మీడియాలో ధనుష్, ఐశ్వర్య పోస్ట్ లు పెట్టడంతో అందరూ ఆశ్చర్య పోయారు.

విడిపోతున్నాం అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ ఇద్దరూ తమ తమ ప్రొఫిషన్స్ లో బిజీ అయిపోయారు. ధనుష్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అటు ఐశ్వర్య నిర్మాణ రంగంలో రాణిస్తూనే ఇటీవలే దర్శకత్వంలోకి కూడా అడుగుపెట్టింది. రీసెంట్ గా లాల్ సలాం అనే సినిమాను తెరకెక్కించింది. ఐశ్వర్య ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్ట్ రోల్ లో కనిపించి మెప్పించారు.

ధనుష్, ఐశ్వర్య విడిపోయి రెండేళ్లు అవుతుంది. విడాకులు అయితే తీసుకోలేదు కానీ ఇద్దరూ విడి విడిగా జీవిస్తున్నారు.   తాజాగా ఐశ్వర్య రజినీకాంత్ దీని గురించి స్పందించింది. లాల్ సలామ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రజినీకాంత్ మాట్లాడుతూ.. ‘దాదాపు రెండేళ్లుగా నేను ఒంటరిగానే ఉంటున్నాను. అయితే ఈ ఒంటరితనాన్ని నేను బాగా ఆస్వాదిస్తున్నాను.  ఒంటరిగా ఉండటం వల్ల నాకు తెలిసిన విషయం ఏంటనే ఒంటరిగా ఉన్నప్పుడే మనం మరింత సురక్షితంగా ఉండగలం. ఇది నాకు బాగా నచ్చింది. నేను నా పిల్లల కోసం సినిమాలనుంచి బ్రేక్ తీసుకున్నాను. పిల్లలు ఎదిగే సమయంలో వారితో ఉండాలనుకున్నాను కానీ కుదరలేదు. చెప్పాలంటే ఒంటరితనము బాగుంది అని తెలిపింది ఐశ్వర్య రజినీకాంత్. చాలా మంది ధనుష్, ఐశ్వర్య తిరిగి కలుస్తారని ఆశపడ్డారు కానీ ఇప్పుడు ఐశ్వర్య చేసిన కామెంట్స్ చూస్తుంటే ఆ విషయంలో అభిమానులకు నిరాశ తప్పదనిపిస్తోంది.

ఐశ్వర్య రజినీకాంత్ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

ఐశ్వర్య రజినీకాంత్ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.