Samantha: సల్మాన్ వీడియోపై రియాక్ట్ అయిన సమంత.. ఇంతకీ ఏమన్నదంటే ?..

|

Jun 27, 2022 | 10:45 AM

ఆమె చేసే పోస్ట్ పై నెటిజన్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా సమంత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వీడియోపై స్పందిస్తూ ఆసక్తికర పోస్ట్ చేసింది.. ఇంతకీ సామ్ రియాక్షన్ ఎందుకు ?..

Samantha: సల్మాన్ వీడియోపై రియాక్ట్ అయిన సమంత.. ఇంతకీ ఏమన్నదంటే ?..
Samantha Salman
Follow us on

టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత (Samantha) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటుందో తెలిసిన సంగతే… ఎప్పటికప్పుడు తన వెకేషన్ ఫోటోస్.. సినిమా అప్డేట్స్ షేర్ చేస్తుంటుంది. విడాకుల ప్రకటన తర్వాత సామ్ చేసే ప్రతి పోస్ట్ నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతుంది. ఆమె చేసే పోస్ట్ పై నెటిజన్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా సమంత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వీడియోపై స్పందిస్తూ ఆసక్తికర పోస్ట్ చేసింది.. ఇంతకీ సామ్ రియాక్షన్ ఎందుకు ?.. ఏమన్నదో తెలుసుకుందామా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమానే కాదు.. ఇందులోని సాంగ్స్ ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి.. ముఖ్యంగా సమంత స్టెపుల్లేసిన ఊ అంటావా మావా సాంగ్ నెట్టింట్లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది.. ఈ పాటకు సెలబ్రెటీలు సైతం కాలు కదిపారు.. తాజాగా ఈ పాట పై స్పందించాడు సల్మాన్.. ఇటీవల ఓ ఈవెంట్లో పాల్గోన్న సల్లూ భాయ్ ను సదరు యాంకర్.. మిమ్మల్ని ప్రభావితం చేసిన సాంగ్ గానీ.. సినిమా గానీ ఉందా ? అని ప్రశ్నించగా.. ఊ అంటావా మావా అని హమ్ చేశాడు.. ఇందుకు సంబంధించిన వీడియోను సల్మాన్ ఫ్యాన్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.. ఇది చూసిన సామ్.. రీట్వీట్ చేస్తూ.. రెడ్ హార్ట్ ఎమోజీస్ షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.