Samantha: ‘వెనక్కి తగ్గాను.. కానీ ఓడిపోలేదు’.. వైరలవుతున్న సమంత ఇన్‏స్టా పోస్ట్..

|

Oct 08, 2022 | 11:52 AM

వరుణ్ ధావన్ సరసన సిటాడెల్ ఇండియా అనే వెబ్ సిరీస్ చేయనుంది. ఇవే కాకుండా హాలీవుడ్ ప్రాజెక్ట్‏కు సైతం ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Samantha: వెనక్కి తగ్గాను.. కానీ ఓడిపోలేదు.. వైరలవుతున్న సమంత ఇన్‏స్టా పోస్ట్..
Samantha
Follow us on

టాలీవుడ్ అగ్రకథానాయిక గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె అరుదైన చర్మ సమస్యతో బాధపడుతుందని.. చికిత్స తీసుకోవడానికి విదేశాలకు సైతం వెళ్లబోతుదంటూ నెట్టింట రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై సామ్ మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. సమంత ప్రస్తుతంత ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆమెకు ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్ లేదని వివరణ ఇచ్చారు. ఆ తర్వాత సామ్ నెమ్మదిగా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ నెట్టంట షేర్ చేస్తూ వచ్చింది. శాకుంతలం, యశోద అప్డేట్స్ షేర్ చేస్తూ మళ్లీ యాక్టివ్ అయ్యింది. చాలా కాలం తర్వాత తాజాగా సమంత షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన పెంపుడు శునకం ఫోటోను షేర్ చేస్తూ.. ” వెనక్కు తగ్గాను.. కానీ ఓడిపోలేదు” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె చేసిన ఇప్పుడు వైరలవుతుంది. సామ్ చేసిన పోస్ట్ పై నెటిజన్స్ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

ప్రస్తుతం సామ్ ఖుషి సినిమాలో నటిస్తోంది. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే యశోద, శాకుంతలం సినిమాలు షూటింగ్స్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. త్వరలోనే ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అలాగే అటు బాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమవుతుంది సామ్. వరుణ్ ధావన్ సరసన సిటాడెల్ ఇండియా అనే వెబ్ సిరీస్ చేయనుంది. ఇవే కాకుండా హాలీవుడ్ ప్రాజెక్ట్‏కు సైతం ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

విడాకుల ప్రకటన తర్వాత సామ్ నటించిన స్పెషల్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప మూవీలో సామ్ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఊ అంటావా పాటలో అదరగొట్టింది సామ్. ఇప్పటికీ ఈ సాంగ్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.