Sai Pallavi: డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్న న్యాచురల్ బ్యూటీ.. ఆ వెబ్ సిరీస్‏లో సాయి పల్లవి..

|

Feb 17, 2023 | 2:15 PM

ఇండస్ట్రీకి ఈ న్యాచురల్ బ్యూటీ దూరంగా ఉంటుందని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరోసారి సాయి పల్లవి గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్ నెట్టింట వైరలవుతుంది. తాజాగా ఈ బ్యూటీ డిజిటల్ ఎంట్రీకి సిద్ధమయ్యినట్లుగా టాక్.

Sai Pallavi: డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్న న్యాచురల్ బ్యూటీ.. ఆ వెబ్ సిరీస్‏లో సాయి పల్లవి..
Sai Pallavi
Follow us on

తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి. అందం.. సహజ నటనతో ఆడియన్స్‏ను కట్టిపడేసింది. ఈ సినిమా తర్వాత సాయి పల్లవికి వరుస ఆఫర్స్ క్యూకట్టినా.. కంటెంట్ ప్రాధాన్యతను బట్టి సినిమాలను ఎంచుకుంటుంది సాయి పల్లవి. ఇటీవలే విరాటపర్వం, గార్గి చిత్రాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీంతో ఇండస్ట్రీకి ఈ న్యాచురల్ బ్యూటీ దూరంగా ఉంటుందని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరోసారి సాయి పల్లవి గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్ నెట్టింట వైరలవుతుంది. తాజాగా ఈ బ్యూటీ డిజిటల్ ఎంట్రీకి సిద్ధమయ్యినట్లుగా టాక్.

సాయి పల్లవి తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు పచ్చజెండా ఊపినట్లుగా తెలుస్తోంది. ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడ శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయబోతున్న ఈ వెబ్ సిరీస్‌లో సాయి పల్లవి నటించేందుకు ఓకే చెప్పిందట. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాకపోవడంతో, నిజంగానే సాయిపల్లవి ఈ మేరకు నిర్ణయం తీసుకుందా అనే ఆసక్తి అభిమానుల్లో క్రియేట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.