Sai Pallavi: సినిమాల సెలక్షన్స్‌లో సాయి పల్లవి సూపర్ అంటున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే
భోళా శంకర్‌లో కీర్తి సురేష్ పాత్ర కోస ముందుగా సాయి పల్లవిని అనుకున్నారు. కానీ సున్నితంగా ఆ పాత్రను ఆమె తిరస్కరించారు.. దానికి చిరంజీవికి సారీ కూడా చెప్పారు. అలాగే డియర్ కామ్రేడ్ సినిమాను కూడా ఈ భామ వదిలేసారు. ఇవే కాదు.. సాయి పల్లవి వదిలేసిన చాలా సినిమాలు రిలీజ్ తర్వాత ఫ్లాపయ్యాయి. ఈమె స్థాయిలోనే టాలెంట్ ఉన్నా.. మొహమాటంతో కీర్తి సురేష్ చేతులారా ఫ్లాప్స్ కొని తెచ్చుకున్నారు. ఈ మధ్యే కొత్త సినిమాకు సైన్ చేసారు సాయి పల్లవి. శివ కార్తికేయన్ హీరోగా కమల్ హాసన్ నిర్మాణంలో రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న సినిమాలో పల్లవి హీరోయిన్.

నో మీన్స్ నో.. వద్దంటే వద్దంతే.. సినిమాల విషయంలో ఇంత ఖరాకండిగా ఉండే హీరోయిన్లు ఎంతమంది ఉంటారు చెప్పండి..? రెమ్యునరేషన్ బాగా ఇస్తున్నారనో.. పెద్ద హీరో ఉన్నారనో.. ఎక్కడో ఓ చోట మొహమాటానికి పోయి ఓకే చెప్తుంటారు.. తర్వాత బాధ పడుతుంటారు. కానీ హమ్ అలగ్ అంటూ దూసుకుపోతున్నారు సాయి పల్లవి. ఈమె అజ్ఞావతాసం ఇంకా ఎన్నాళ్లు..? సాయి పల్లవి కాదన్న సినిమాల పరిస్థితేంటో తెలుసా..? సినిమాలు చేస్తూ ట్రెండింగ్‌లో ఉండటం ఎంతసేపు..? ఎప్పుడైనా ఉండొచ్చు.. ఎవరైనా ఉండొచ్చు.. కానీ ఏడాదిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ కూడా ట్రెండింగ్‌లో ఉండటం అంటే మాత్రం అక్కడున్నది సాయి పల్లవి అని అర్థం చేసుకోవాలేమో..? బిల్డప్ కాస్త ఓవర్ అనిపించినా జరుగుతున్నదిదే.
View this post on Instagram
సినిమాలు చేసినా చేయకపోయినా ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటున్నారీ భామ. హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే ఈ క్రేజ్ ఫిదా బ్యూటీకి సాధ్యమైంది. విరాట పర్వం తర్వాత తెలుగులో సినిమా చేయలేదు ఈ భామ. కానీ క్రేజ్ పరంగా మాత్రం సాయి పల్లవి నెక్ట్స్ లెవల్ అంతే. తర్వాతి సినిమా ఎప్పుడు మేడమ్ అంటే.. మంచి కథ రావాలి కదండీ.. అది లేకపోతే నేనెలా సినిమా చేస్తానటున్నారీమే. ఆ కథ వచ్చేవరకు ఖాళీగా ఉంటాను కానీ కాసుల కోసం సినిమాలు చేయనంటున్నారు. అలా సాయి పల్లవి వదిలేసిన భోళా శంకర్, డియర్ కామ్రేడ్ రిజల్ట్స్ ఏంటో అందరికీ తెలుసు.
View this post on Instagram
భోళా శంకర్‌లో కీర్తి సురేష్ పాత్ర కోస ముందుగా సాయి పల్లవిని అనుకున్నారు. కానీ సున్నితంగా ఆ పాత్రను ఆమె తిరస్కరించారు.. దానికి చిరంజీవికి సారీ కూడా చెప్పారు. అలాగే డియర్ కామ్రేడ్ సినిమాను కూడా ఈ భామ వదిలేసారు. ఇవే కాదు.. సాయి పల్లవి వదిలేసిన చాలా సినిమాలు రిలీజ్ తర్వాత ఫ్లాపయ్యాయి. ఈమె స్థాయిలోనే టాలెంట్ ఉన్నా.. మొహమాటంతో కీర్తి సురేష్ చేతులారా ఫ్లాప్స్ కొని తెచ్చుకున్నారు. ఈ మధ్యే కొత్త సినిమాకు సైన్ చేసారు సాయి పల్లవి. శివ కార్తికేయన్ హీరోగా కమల్ హాసన్ నిర్మాణంలో రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న సినిమాలో పల్లవి హీరోయిన్. దీన్ని మించిన కథేదైనా వస్తే తప్ప మరో సినిమాకు సైన్ చేయకూడదని ఫిక్సయ్యారు ఈ భామ. కానీ ఆ కథ రావాలిగా..! మనీ రూల్ చేస్తున్న ఇండస్ట్రీలో.. నా పేరు సాయి పల్లవి.. విలువలే నా ఆస్తి అనేవాళ్లు ఎంతమందుంటారు చెప్పండి..? అందుకే హీరోయిన్స్ నందు సాయి పల్లవి వేరయా అనేది..!
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



