Sai Pallavi: వారెవ్వా.. ఎన్నాళ్లకు ఇంత అందమైన వీడియో వచ్చింది.. ఇందు రెబెక్కా వర్గీస్‏గా సాయి పల్లవి..

|

Sep 28, 2024 | 7:24 AM

దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు రెండు సినిమాలతో రాబోతుంది. అందులో ఒకటి నాగచైతన్య తండేల్ మూవీ. మరొకటి తమిళంలో అమరన్. ఈ మూవీలో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను ముకుంద వరదరాజన్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ క్యూరియాసిటిని కలిగించాయి.

Sai Pallavi: వారెవ్వా.. ఎన్నాళ్లకు ఇంత అందమైన వీడియో వచ్చింది.. ఇందు రెబెక్కా వర్గీస్‏గా సాయి పల్లవి..
Sai Pallavi
Follow us on

దక్షిణాది ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. సాయి పల్లవి నడిచే విధానం, మాట్లాడే విధానం, ప్రవర్తించే తీరు..ఇలా ప్రతి విషయంలోనూ కోట్లాది మంది ఫిదా అయ్యారు. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో సాయి పల్లవి అద్భుతమైన పాత్రతో తెరపై చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు ఫుల్ ట్రీట్ ఇచ్చేసింది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు రెండు సినిమాలతో రాబోతుంది. అందులో ఒకటి నాగచైతన్య తండేల్ మూవీ. మరొకటి తమిళంలో అమరన్. ఈ మూవీలో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను ముకుంద వరదరాజన్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ క్యూరియాసిటిని కలిగించాయి.

అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి కేవలం సాయి పల్లవి పాత్రకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో శివకార్తికేయన్ భార్య ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో కనిపించనుంది. 1:22 నిమిషాలు ఉన్న ఈ వీడియోలో సాయి పల్లవి లుక్స్, యాక్టింగ్ చూసి మరోసారి అడియన్స్ ఫిదా అయ్యారు. చాలా కాలం తర్వాత తమ అభిమాన హీరోయిన్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. న్యాచురల్ బ్యూటీ ఈజ్ బ్యాక్.. సాయి పల్లవి మరోసారి హృదయాలను కొల్లగొట్టిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిన్న విడుదలైన అమరన్ మూవీ సాయి పల్లవి రోల్ ఇంట్రడ్యూస్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.

విలక్షణ నటుడు కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 31న తెలుగు, తమిళం భాషలలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తుండగా.. ఈ మూవీతో సాయి పల్లవి మరో హిట్టు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. చెన్నైకి చెందిన మేజర్ ముకుంద వరదరాజన్ ఇండియన్ ఆర్మీలో మేజర్‌గా పనిచేశారు. 2014లో ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో అమరుడయ్యాడు. ఆయన జీవిత కథ ఆధారంగా రాజ్‌కుమార్‌ పెరియస్వామి ఈ మూవీని రూపొందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.