Reema Sen: నా ఫస్ట్ క్రష్ అతనే.. అది ఇప్పటికీ మర్చిపోలేను.. రీమాసేన్ క్రేజీ కామెంట్స్

|

Jun 20, 2024 | 6:49 PM

చిత్రం సినిమా ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. అప్పట్లో కుర్రాళ్ళు ఈ సినిమాను ఎగబడి చూశారు. ఈ సినిమా అప్పటిలో ఊపు ఊపేసింది. ఈ సినిమాతో ఈ ఇద్దరి జోడీ ప్రేక్షకులను మెప్పించింది. ఈ ఇద్దరూ జోడీ చిత్రం సినిమా తర్వాత మనసంతా నువ్వే సినిమాలో కలిసి నటించారు. ఇక ఈ అమ్మడు హీరోయిన్ గా తెలుగులో సీమ సింహం, అదృష్టం, వీడే, నీతో వస్తా, నీ మనసు నాకు తెలుసు, అంజి సినిమాలు చేసింది. 

Reema Sen: నా ఫస్ట్ క్రష్ అతనే.. అది ఇప్పటికీ మర్చిపోలేను.. రీమాసేన్ క్రేజీ కామెంట్స్
Reema Sen
Follow us on

చిత్రం సినిమాతో చాలా మంది నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఉదయ్ కిరణ్, రీమాసేన్ జంటగా నటించిన ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ఉదయ్ కిరణ్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చిత్రం సినిమా తర్వాత మరోసారి తేజ దర్శకత్వంలో సినిమాలో చేశాడు ఉదయ్. చిత్రం సినిమా తర్వాత  రీమాసేన్ క్రేజ్ కూడా పెరిగిపోయింది. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. రీమాసేన్ ఎక్కువగా తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. తెలుగు, హిందీలోనూ నటించింది. రీమా సేన్ వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్‌ను 2012లో వివాహం చేసుకుంది.

చిత్రం సినిమా ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. అప్పట్లో కుర్రాళ్ళు ఈ సినిమాను ఎగబడి చూశారు. ఈ సినిమా అప్పటిలో ఊపు ఊపేసింది. ఈ సినిమాతో ఈ ఇద్దరి జోడీ ప్రేక్షకులను మెప్పించింది. ఈ ఇద్దరూ జోడీ చిత్రం సినిమా తర్వాత మనసంతా నువ్వే సినిమాలో కలిసి నటించారు. ఇక ఈ అమ్మడు హీరోయిన్ గా తెలుగులో సీమ సింహం, అదృష్టం, వీడే, నీతో వస్తా, నీ మనసు నాకు తెలుసు, అంజి సినిమాలు చేసింది.

ఆతర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం, యమగోల మళ్లీ మొదలైంది, ముగ్గురు అనే సినిమాల్లో కనిపించింది. ఇక పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది ఈ చిన్నది.  రీమా సేన్ వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్‌ను 2012 లో వివాహం చేసుకుంది. సోషల్ మీడియాలో రీమాసేన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇటీవల రీమాసేన్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. స్కూల్‌ టైమ్‌లోనే రీమాకి ఫస్ట్ క్రష్ ఉండేదట.. ఆ అబ్బాయి చాలా అందంగా , ఫెయిర్ గా ఉండేవాడట. నిజానికి అలా ఫెయిర్ గా ఉండేవాళ్ళు తనకు అంతగా నచ్చరని.. కానీ అతను మాత్రం బాగా నచ్చాడు అని తెలిపింది. అతన్ని చూస్తూ అలానే ఉండిపోయేదట.. ఒకేసారి పార్టీలో రెడ్ కలర్ షర్ట్ బ్లాక్ కలర్ జాకెట్ వేసుకున్నాడట అతని చూస్తూ పడిపోయాను.. అతని ఫేస్ ఇప్పుడు గుర్తులేదు కానీ అతని లుక్ మాత్రం ఎప్పటికి మర్చిపోలేను.. అతని డ్రస్ గుర్తుండిపోయింది అని చెప్పుకొచ్చింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో రీమాసేన్ మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.