
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయన్ సినిమా అక్టోబర్ 10న విడుదలైంది. దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా నిర్మించింది. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన మలయాళ నటి మంజు వారియర్ నటించింది. క్రైమ్ అండ్ యాక్షన్ కథాంశంతో ఈ చిత్రం తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, చౌవిన్ షాహిర్ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ సినిమా పై అంచనాలు పెంచేసింది.
ఈ సినిమా మొదటి దశ షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం ఈ సినిమా తదుపరి దశ షూటింగ్ జరుపుకుంటుంది ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ లో మరో ముద్దుగుమ్మ కూడా చేరిందని తెలుస్తోంది. దళపతి విజయ్ నటించిన బిగిల్ సినిమాలో నటించిన రెబా మోనికా జాన్ ఈ సినిమాలో జాయిన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అట్లీ దర్శకత్వం వహించిన బిగిల్‌లో నటి రెబా మోనికా జాన్ కీలక పాత్ర పోషించింది. సినిమాలో యాసిడ్ బారిన పడిన యువతిగా కనిపించి ఆకట్టుకుంది రెబా.
ఆ సినిమా సక్సెస్ తర్వాత ఆల్బమ్ సాంగ్స్, వెబ్ సిరీస్, సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ. ఇప్పుడు దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూలీ సినిమాలో నటిగా చేరిపోయిందని వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో నటి రెబా మోనికా జాన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు. రజనీకాంత్ 171వ చిత్రం ‘కూలీ’ వచ్చే 2025లో విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రం తర్వాత దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌తో కలిసి ‘జైలర్ 2’లో నటించనున్నారు సూపర్ స్టార్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.