
ప్రేమికులందరూ వాలెంటైన్స్ డే ను ఘనంగా జరుపుకొన్నారు. వివిధ రూపాల్లో తమ ప్రేమను వ్యక్తం చేశారు. కొంతమంది సెలబ్రిటీలు కూడా వాలంటైన్స్ డే పోస్టులు షేర్ చేశారు. డైరెక్టుగా పేరు చెప్పకుండా తమ ప్రియమైన వారికి సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు. అలా తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఇన్ స్టా స్టోరీస్ లో గులాబీల బొకే ఫోటోను షేర్ చేసింది. ఒక స్పెషల్ పర్సన్ ఆ గులాబీలను పంపినట్లు తెలిపింది. అంతేకాదు దీనికి ఒక క్రేజీ క్యాప్షన్ కూడా జత చేసింది ‘నీకు నా మొహంలో చిరునవ్వును ఎలా తెప్పించాలో బాగా తెలుసు పాపలు’ అంటూ రెడ్ హార్ట్ సింబల్‌ను జత చేసింది రష్మిక. అయితే ఈ గులాబీల పుష్పగుచ్ఛాన్ని ఎవరో ఇచ్చారో మాత్రం వెల్లడించలేదు రష్మిక. ఈ ఫొటో నెట్టింట బాగా వైరల్ అయింది. దీంతో నెటిజన్లు తమకు తోచిన విధంగా ఊహించుకుంటున్నారు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండనే రష్మికకు ఈ గులాబీలు పంపించి ఉంటాడని కామెంట్స్ పెడుతున్నారు
కాగా గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలిసి నటించారు. అప్పటి నుంచే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ రూమర్లకు బలం చేకూరేలా వీరు పలుమార్లు వెకేషన్లు, విహార యాత్రలకు కలిసి వెళ్లారు. అయితే రష్మిక కానీ, విజయ్ కానీ తమ ప్రేమ గురించి ఎప్పుడూ నేరుగా ఏమీ చెప్పలేదు.
Laxman sir is so busy with all the editing and all of the serious film work and so Vicky and I thought we’ll kidnap him and do off a mini photoshoot.. 😋🐒 and after that we ended up doing our lil shoot to tell you guys that- ‘Chhaava is coming out in 3 days and we are so so… pic.twitter.com/aHB6m41BZc
— Rashmika Mandanna (@iamRashmika) February 11, 2025
రష్మిక మందన్నకు చిత్ర పరిశ్రమలో డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ‘యానిమల్’, ‘పుష్ప 2’ సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు ‘ఛవా’ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. ప్రస్తుతం రష్మిక సల్మాన్ ఖాన్ చిత్రం ‘సికందర్’లో నటిస్తోంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ధనుష్ కుబేరతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు రష్మిక చేతిలో ఉన్నాయి
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.