
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ప్రస్తుతం వరల్డ్ వైడ్ మారుమోగుతున్న పేరు. యానిమల్, పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇటీవలే ఛావా సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దీంతో గత రెండేళ్లలో మూడు పాన్ ఇండియా చిత్రాలకు ఏకంగా రూ.3 వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు.. ప్రస్తుతం తెలుగుతోపాటు హిందీలోనూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఈ అమ్మడు. ఇటీవలే సికందర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల పోర్బ్స్ నివేదిక రష్మిక సంపాదనను బయటపెట్టింది.
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. రష్మిక ఆస్తులు రూ.66 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. అలాగే ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల వరకు వసూలు చేస్తుందట. ఇదిలా ఉంటే.. సాధారణంగా సినీరంగంలో హీరోహీరోయిన్స్ ఖరీదైన స్వాంకీ కార్లలో దిగడం కొందరు బాలీవుడ్ స్టార్లకు సాధ్యం అని భావిస్తాం.. తాజాగా నేషనల్ క్రష్ సైతం ఖరీదైన కారుకు ఓనర్ అయ్యింది. ఇటీవలే ఆమె మెర్సిడెస్ బెంజ్ ఎస్ 450ని కొనుగోలు చేసింది. ఈ కారు ధర దాదాపు రూ.2 కోట్లకు పైగా ఉంటుందని టాక్.
నిజానికి సినీతారలకు ఆటోమొబైల్స్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. చాలా మంది తారలు రోల్స్ రాయిస్, లంబోర్గినీ, మే బ్యాక్ వంటి ఖరీదైన కార్లలో సందడి చేస్తుంటారు. ఇక ఇప్పుడు రష్మిక సైతం లగ్జరీ కారులో షికారు చేస్తూ ఎక్కడా తగ్గడం లేదు. ప్రస్తుతం రష్మిక గ్యారేజీలో 5 రకాల లగ్జరీ బ్రాండ్ కార్లు ఉన్నాయి. ఈ కార్ల కోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తోంది.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..