Rashi Khanna: యోధ కోసం రంగంలోకి దిగిన హీరోయిన్.. బాలీవుడ్‏లోకి రాశీ ఖన్నా రీఎంట్రీ..

|

Jan 06, 2022 | 8:24 AM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో రాశీ ఖన్నా ఒకరు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ

Rashi Khanna: యోధ కోసం రంగంలోకి దిగిన హీరోయిన్.. బాలీవుడ్‏లోకి రాశీ ఖన్నా రీఎంట్రీ..
మలయాళ సినిమా పూర్తిగా కంటెంట్ రిచ్ నెస్ తో ఉంటుంది… తెలుగు సినిమా ఎక్కువగా కమర్షియల్ గా ఉంటుంది. హిందీ సినిమా ఇప్పటికీ దాని స్థానం ఎక్కడుందో వెతికేందుకు ప్రయత్నిస్తోంది“ అని తెలిపింది రాశిఖన్నా.
Follow us on

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో రాశీ ఖన్నా ఒకరు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ఓవైపు నయా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే.. మరోవైపు చేతిలో ఉన్న చిత్రాలను చకచకా పూర్తి చేస్తుంది. ఇప్పటికే తెలుగులో నాగచైతన్య సరసన థ్యాంక్యూ సినిమాలో నటిస్తోంది. అలాగే గోపిచంద్ జోడీగా పక్కా కమర్షియల్ సినిమాను పూర్తిచేసింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బాలీవుడ్ సినిమా కోసం రంగంలోకి దిగింది ఈ అమ్మడు. ప్రస్తుతం ఆమె హిందీలో యోధ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సాగర్ అంబ్రే దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తుండగా.. దిశా పటానీ హీరోయిన్‏గా నటిస్తోంది. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాని ధర్మ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. తాజాగా యోధ సెట్లోకి అడుగుపెట్టింది రాశీ ఖన్నా. ఈ విషయాన్ని తన ఇన్ స్టా ద్వారా తెలియజేసింది రాశీఖన్నా. ఇంత సాదర స్వాగతం పలికినందుకు చిత్ర బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ‘యోధ’ సెట్లో.. తొలిరోజు అంటూ తన స్టేటస్‏లో రాసుకొచ్చింది. ప్రస్తుతం రాశీ ఖన్నా హిందీలో అజయ్ దేవగణ్ నటిస్తోన్న రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌ అనే వెబ్ సిరీస్ చేస్తుంది. అలాగే రాజ్‌ – డికె రూపొందించనున్న మరో యాక్షన్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌లోనూ నటించనుంది. ఇందులో విజయ్‌ సేతుపతి, షాహిద్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక యోధ సినిమా వచ్చే ఏడాది నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Naa Peru Shiva 2: మరో సినిమాతో ప్రేక్షకుల ముందు రానున్న కార్తీ.. త్వరలో ప్రేక్షకుల ముందుకు” నాపేరు శివ 2″

Gali Janardhan Reddy Son: హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న గాలి జనార్దన్ రెడ్డి​ కొడుకు.. దర్శకుడు ఎవరంటే..

Rana Daggubati : మరో రీమేక్‌ను లైన్‌లో పెట్టనున్న దగ్గుబాటి హీరో.. శింబు సినిమా పై కన్నేసిన రానా..