సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రమ్యకృష్ణ. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన రమ్యకృష్ణ.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ దూసుకుపోతున్నారు. నీలాంబరిగా ఆడియన్స్ మదిలో నిలిచిపోయిన రమ్యకృష్ణ.. ఇక ఇప్పుడు యువతారానికి శివగామిగా దగ్గరయ్యారు. వైవిధ్యమైన పాత్రలలో మెప్పించి ప్రశంసలు అందుకున్నారు. అయితే సుధీర్ఘ సినీ ప్రయాణంలో రమ్యకృష్ణ ఒక నటుడికి చెల్లిగా.. కూతురుగా.. భార్యగా నటించారు. అతను ఎవరో తెలుసా. విలక్షణ నటుడు నాజర్.
రజినీకాంత్.. సౌందర్య జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం నరసింహ. ఇందులో నీలాంబరి అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించారు రమ్యకృష్ణ. అయితే ఇదే సినిమాలో ఆమె అన్నయ్యగా నాజర్ నటించారు. ఇక అలాగే.. తమిళంలో సూపర్ హిట్ అయిన వంత రాజవతాన్ వరువేను చిత్రంలో నాజర్ కూతురిగా కనిపించారు రమ్యకృష్ణ.
ఈ సినిమా తెలుగులో అత్తారింటికి దారేది రీమేక్ గా తెరకెక్కించారు. తెలుగులో నదియా పాత్రను రమ్యకృష్ణ చేశారు. అలాగే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించి బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ నాజర్ భార్యగా నటించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.