మాస్ మాహారాజా రవితేజకు (Raviteja) యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇడియట్ సినిమా నుంచి ఖిలాడీ సినిమా వరకు ఆయనలో ఎనర్జీ మాత్రం తగ్గట్లేదు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తు్న్నారు రవితేజ. ఇటీవలే క్రాక్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న మాస్ మాహారాజా ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన చేస్తున్న రామారావు ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వర్ రావు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇందులో డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా హీరోయిన్లలో ఒకరైన రజిషా విజయన్ మీడియాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా రజిషా మాట్లాడుతూ.. “నేను తమిళ్లో చేసిన ‘కర్ణన్’ సినిమా చూసి డైరెక్టర్ శరత్ నాకు కాల్ చేసి ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. రామారావు ఆన్ డ్యూటీ లో మాళిని అనే పాత్రలో కనిపిస్తాను. ఒక భాషలో పరిచయమౌతున్నపుడు బలమైన కథ, పాత్ర కావాలని ఎదురుచూశాను. నేను ఎదురుచుసిన పాత్ర ఈ సినిమాతో దక్కింది. ఇంతమంచి సినిమాతో తెలుగులో పరిచయం కావడం ఆనందంగా వుంది. నేను నార్త్ ఇండియాలో పెరిగాను. రవితేజ గారి సినిమాలు హిందీ డబ్బింగ్ లో చూసేదాన్ని. నా స్నేహితులందరికీ రవితేజ గారు తెలుసు. ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నాం కానీ ఆ రోజుల్లోనే రవితేజ గారికి ఆ రీచ్ వుంది. రవితేజ గారితో పని చేయడం గొప్ప అనుభవం. రవితేజ గ్రేట్ మాస్ హీరో, సూపర్ స్టార్. ఆయన సెట్స్ కి వస్తే ఒక మెరుపులా వుంటుంది. మొత్తం ఎనర్జీతో నిండిపోతుంది. షూటింగ్ సెట్ లో అందరితో సమానంగా ఉంటారు. ” అంటూ చెప్పుకొచ్చింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.