Priyanka Mohan: స్పీడ్ పెంచేసిన ప్రియాంక మోహన్.. క్రేజీ బ్యూటీకి క్యూ కడుతోన్న ఆఫర్స్

తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటిస్తుంది. ప్రస్తుతం తెలుగులో వరుసగా చిత్రాల్లో నటిస్తుంది. న్యాచురల్ స్టార్ నాని జోడిగా సరిపోదా శనివారం చిత్రంలో నటించి మంచి హిట్ అందుకుంది.  సరిపోదా శనివారం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ప్రియాంక తన నటనతో ఆకట్టుకుంది.

Priyanka Mohan: స్పీడ్ పెంచేసిన ప్రియాంక మోహన్.. క్రేజీ బ్యూటీకి క్యూ కడుతోన్న ఆఫర్స్
Priyanka Mohan
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 04, 2024 | 2:40 PM

సౌత్ ఇండస్ట్రీలో సరైన బ్రేక్ ఎదురుచూస్తోంది హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటిస్తుంది. ప్రస్తుతం తెలుగులో వరుసగా చిత్రాల్లో నటిస్తుంది. న్యాచురల్ స్టార్ నాని జోడిగా సరిపోదా శనివారం చిత్రంలో నటించి మంచి హిట్ అందుకుంది.  సరిపోదా శనివారం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ప్రియాంక తన నటనతో ఆకట్టుకుంది. నటి ప్రియాంక మోహన్ స్వస్థలం చెన్నై. ఆమె తల్లి కర్ణాటకకు చెందినవారు. తండ్రి తమిళుడు. ఈ ముద్దుగుమ్మ  20 నవంబర్ 1994న బెంగళూరులో జన్మించింది.

ఈ ముద్దుగుమ్మ 2019 లో కన్నడ భాషా చిత్రం ఓండు కథే హెల్లాతో తన సినీ రంగ ప్రవేశం చేసింది. ప్రియాంక మోహన్ అదే సంవత్సరంలో నాని గ్యాంగ్ లీడర్‌ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. 2021లో దర్శకుడు నెల్సన్ దర్శకత్వం వహించిన వరుణ్ డాక్టర్ సినిమాతో ప్రియాంక మోహన్ తమిళ సినిమాలో నటిగా అరంగేట్రం చేసింది. అమాయకమైన క్యూట్ గర్ల్ గా నటించిన ప్రియాంక మోహన్ అభిమానుల మనసు గెలుచుకుంది.

వరుణ్ డాక్టర్ విజయం తరువాత, ఆమె మళ్లీ శివ కార్తికేయన్ సరసన డాన్‌లో జతకట్టింది. అదేవిధంగా పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈదిరుమ్ వటిందావన్ చిత్రంలో సూర్య సరసన ప్రియాంక మోహన్ నటించింది. ప్రియాంక మోహన్ ధనుష్‌తో కలిసి కెప్టెన్ మిల్లర్‌లో నటించింది. ఎప్పుడూ జెంటిల్‌ గాళ్‌గా నటించే ప్రియాంక మోహన్‌ ధనుష్‌ కెప్టెన్‌ మిల్లర్‌లో ఫైటర్‌గా నటించింది. ఈ చిన్నది తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.  ప్రియాంక మోహన్ తెలుగులో నానితోసరిపోదా శనివారం చిత్రంలో నటించింది. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమానుంచి అప్డేట్స్ రానున్నాయి. ప్రియాంక మోహన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.  ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో 5 మిలియన్లకు పైగా ఫాలోవర్లను ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ