
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సాహో డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ఒరిజినల్ గ్యాంగస్టర్ (వర్కింగ్ టైటిల్). పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాత డివీవీ దాన్య నిర్మిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఓజీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అలాగే సుజీత్ షూటింగ్ లొకేషన్ల కోసం తెగ వెతుకుతున్నాడని. కాగా ఓజీ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌గా గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంక అరుల్ మోహన్ ఎంపికచేశారట దర్శకనిర్మాతలు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక సమచారం రానుందట. పవన్ కల్యాణ్, ప్రియాంక ఇద్దరూ వచ్చే వారం చిత్రీకరణలో జాయిన్ కానున్నారట. ముంబైలో మొదటి షెడ్యూల్ షూటింగ్ జరగనుందని సమాచారం.
కాగా న్యాచురల్ స్టార్ నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది ప్రియాంక. ఆతర్వాత శర్వానంద్ శ్రీకారం సినిమాలో నటించింది. చేసింది రెండు సినిమాలే అయినా తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైందీ మలయాళీ ముద్దుగుమ్మ. అయితే శ్రీకారం తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు కానీ కోలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళుతోంది. శివ కార్తికేయన్ డాక్టర్, డాన్, సూర్య ఈటీ తదితర సినిమాలు చేసింది. ప్రస్తుతం ‘కెప్టెన్ మిల్లర్’, తమిళ దర్శకుడు ఎం. రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలోనూ నటిస్తూ ఉంది. ఇలోగా పవన్ కల్యాణ్ చిత్రంలోనూ ఛాన్స్ రావడంతో ఈ ముద్దుగుమ్మ ఖాతాలో మరో హిట్ పడినట్టేనంటున్నారు. కాగా ఓజీ సినిమాకు అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నారు.
#OG | Pawan Kalyan & Priyanka Mohan. pic.twitter.com/suF7MIL4WX
— Christopher Kanagaraj (@Chrissuccess) April 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..