Actress: ‘ఆంటీ’ అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.! నటి ప్రగతి ఏం చెప్పారంటే.?

టాలీవుడ్ నటి ప్రగతి.. సోషల్ మీడియాలో చేస్తోన్న 'ఆంటీ' కామెంట్స్‌పై గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. అలాగే సినీ కెరీర్‌పై పలు కీలక విషయాలను పంచుకుంది. పని అడగడంపై తనకు నమ్మకం లేదని, కేవలం పాత్ర నచ్చితేనే సినిమాలు చేస్తానని పేర్కొంది.

Actress: ఆంటీ అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.! నటి ప్రగతి ఏం చెప్పారంటే.?
Pragathi

Updated on: Jan 12, 2026 | 12:45 PM

టాలీవుడ్ నటి ప్రగతి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలతో పాటు, సినీ కెరీర్‌కు సంబంధించిన కొన్ని కీలక అంశాలను పంచుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్న ప్రగతి.. తనను ఏ ఇతర పేర్లతో కంటే కేవలం నటి అని పిలవడం ఇష్టమని పేర్కొంది. కామెడీ పాత్రలు చేయడం తనకు చాలా కష్టమని, అలాంటి వాటిలో రాణించడం తనకు గర్వకారణమని చెప్పింది. సోషల్ మీడియాలో ‘ఆంటీ’ అనే కామెంట్స్‌పై స్పందిస్తూ.. నటి ప్రగతి ఇలా చెప్పుకొచ్చారు. తన పిల్లల స్నేహితులు ఆంటీ అని పిలవడంలో ఎలాంటి అభ్యంతరం లేదని ప్రగతి స్పష్టం చేసింది. అది తల్లి తర్వాత వచ్చే ఆప్యాయ పదం అని వివరించింది. అయితే, సోషల్ మీడియాలో కొందరు ద్వంద్వార్థాలతో, అసభ్యకర రీతిలో ఈ పదాన్ని వాడినప్పుడు తన ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతుందని ఆమె పేర్కొంది. తనకు గౌరవం ఇవ్వకపోతే నచ్చదని, తాను గౌరవాన్ని కోరుకుంటానని చెప్పింది.

ఇది చదవండి: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’

కెరీర్ విషయానికొస్తే.. తాను ఎప్పుడూ ఎవరినీ పని అడగలేదని, తన జీవితంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఫోన్ చేసి కోరలేదని నటి ప్రగతి తెలిపింది. ఒక పాత్రకు తాను సరిపోతానని చిత్రనిర్మాతలు భావిస్తే వారే పిలుస్తారని, అడిగితే తన పనిపై తనకు నమ్మకం లేదనిపిస్తుందని ఆమె అభిప్రాయపడింది. అలాగే వేణు స్వామి పూజల వల్ల తనకు విజయం వచ్చిందనే ప్రచారంపై కూడా నటి ప్రగతి తీవ్రంగా స్పందించింది. రెండు సంవత్సరాల క్రితం తన బ్యాడ్ టైమ్‌లో ఉన్నప్పుడు నమ్మకంతో వెళ్లాలని.. ఆయన పూజలు బాగా చేసినా తనకు ఏమీ జరగలేదని తెలిపారు. తన విజయం అనేది తన సొంత కష్టం, రక్తం, చెమటతో కూడిన ఫలితమని, ఎవరైనా దాని క్రెడిట్ తీసుకోవాలని చూస్తే అది తన కష్టానికి అవమానమేనని ఆమె చెప్పింది. తనకు ఎవరైనా డైరెక్టర్‌తో పనిచేసేటప్పుడు ఇబ్బంది కలిగితే.. మళ్లీ ఆయనతో పనిచేయనని తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇటీవల ఆసియా ఛాంపియన్ షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆమె పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనడం తన లక్ష్యమని చెప్పింది. సినిమా షూటింగ్‌ల మధ్య జిమ్‌కు సమయం కేటాయించుకుంటానని.. ఇది తన యాక్టివ్‌నెస్‌కు తోడ్పడుతుందని ఆమె తెలిపింది. డైట్ పాటించకుండానే బాగా తింటానని, అంత కఠినమైన వ్యాయామం చేయడానికి శక్తి ఆహారం నుంచే వస్తుందని వివరించింది. పవర్ లిఫ్టింగ్ చేయడం వల్ల మహిళలు తమ స్త్రీత్వాన్ని కోల్పోతారనే అభిప్రాయాన్ని ఆమె తోసిపుచ్చింది. జిమ్‌కు వెళ్తే మహిళలు మగవారిలా మారిపోతారనేది ఒక మానసిక భావన మాత్రమేనని.. తన గొంతు, ముఖం, జుట్టు ఏమీ మారలేదని, తాను ఇప్పటికీ సినిమాలు చేస్తూ స్త్రీగానే ఉన్నానని ప్రగతి స్పష్టం చేసింది.

ఇది చదవండి: ఆ సినిమానే చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించింది.. ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ దర్శకుడు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..