Poonam Kaur: ఆ స్టార్ హీరో గురించి చాలా చెప్పాలి.. కానీ ఇప్పుడు కాదు.. హీరోయిన్ పూనమ్ కౌర్ కామెంట్స్ వైరల్..

|

Mar 14, 2022 | 8:09 AM

హీరోయిన్ పూనమ్ కౌర్ (Poonam Kaur).. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యిన ఈ అమ్మడు..

Poonam Kaur: ఆ స్టార్ హీరో గురించి చాలా చెప్పాలి.. కానీ ఇప్పుడు కాదు.. హీరోయిన్ పూనమ్ కౌర్ కామెంట్స్ వైరల్..
Poonam
Follow us on

హీరోయిన్ పూనమ్ కౌర్ (Poonam Kaur).. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యిన ఈ అమ్మడు.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో హాడావిడి చేయడం.. ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం చేస్తుంటుంది. అలాగే పూనమ్ చేసే ట్వీట్స్…కామెంట్స్ గురించి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. పీకే లవ్స్ అంటూ పూనమ్ చేసే రచ్చ గురించి తెలిసిందే. పీకే లవ్స్ పేరుకు ఇటీవలే అర్థాన్ని సైతం రివీల్ చేసింది. పీ అంటే పూనమ్.. కే అంటే కౌర్ అంటూ క్లారిటీ ఇచ్చేంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నాతి చరామి. ఈ మూవీ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది పూనమ్.

తనకు చిన్న వయసులోనే సినిమా ఆఫర్లు ఎక్కువగా వచ్చాయని.. కానీ కుటుంబసభ్యులకు ఇష్టం లేకపోవడంతో ఒప్పుకోలేదని చెప్పింది. అలాగే కెరీర్ ప్రారంభంలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ వచ్చిందని.. కానీ తను నో చెప్పినట్లుగా తెలిపింది. అలాగే తనకు నాగార్జున కుటుంబం అంటే చాలా ఇష్టమని.. మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా రెస్పెక్ట్ ఉందని చెప్పుకొచ్చింది. అలాగే.. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ గురించి చాలా విషాయాలు చెప్పాలని ఉందని.. కానీ ఇప్పుడు కాదంటూ సస్పెన్స్ క్రియేట్ చేసింది. అలాగే ప్రభాస్ క్యారెక్టర్ మరే ఇతర హీరోలకు లేదని తెలిపింది. మనుషుల్ని నమ్మి.. ఐదు సంవత్సరాలు ఒకే ఒక్క మూవీకి అది కూడా ప్రైమ్ టైంలో కేటాయించడం అనేది చాలా గ్రేట్ అని.. నమ్మిని వాళ్ల కోసం నిలబడడమే ప్రభాస్ క్యారెక్టర్ అంటూ చెప్పుకొచ్చింది.

Also Read: Ram Charan-Upasana: చిన్నపిల్లాడిగా మారిన చెర్రి.. లోకాన్ని మరిచి చిలిపి పనులతో అల్లరి చేసిన మెగా కపూల్..

Viral Photo: కురుల మాటున మోము దాచిన అందాల సీతాకోకచిలక.. స్టార్ హీరో తనయ.. ఎవరో గుర్తుపట్టండి..

Poonam Kaur: ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తే చేయలేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ పూనమ్ కౌర్..

Bandla Ganesh: దేవర జెండాకి కర్రనౌతా.. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ రచ్చ..