అన్న రిస్క్ అవసరమా..!! స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే..

హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు కొన్ని సంవత్సరాల క్రితం వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిందీ అందాల తార. తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస హిట్ చిత్రాలను అందించిన ఘనత పూజా హెగ్డేకి దక్కింది. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తదితర తెలుగు స్టార్ నటులందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది.

అన్న రిస్క్ అవసరమా..!! స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే..
Pooja Hegde

Updated on: Nov 08, 2025 | 5:57 PM

అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే.. వరుసగా సినిమాలు చేస్తున్న అంతగా అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తదితర తెలుగు స్టార్ నటులందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ కాలం గిర్రున తిరిగింది. గత మూడు సంవత్సరాలుగా పూజా హెగ్డే ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. వరుసగా హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఆ నటి ఇప్పుడు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు! ఇటీవలే సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమాలో హీరోయిన్ గా చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో పేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన రాధేశ్యామ్‌, బీస్ట్, ఆచార్య, సిర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్, దేవా రీసెంట్ గా వచ్చిన రెట్రో ఇలా వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి. వరుసగా ఏడు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఈ అమ్మడికి వరుసగా ఛాన్స్ లు వస్తున్నాయి. ప్రస్తుతం దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న జననాయగన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఈ సినిమాను పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ చిన్నదనికి ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు తమిళ్ స్టార్ హీరో ధనుష్. తమిళ హీరో ధనుష్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ హీరోకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కొన్నాళ్లక్రితం ధనుష్ నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ధనుష్. మొన్నామధ్య డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాతో హిట్ అందుకున్నారు. రీసెంట్ గా ఇడ్లీ కొట్టు అనే సినిమా చేశాడు. ఇప్పుడు ధనుష్ 55వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. దాంతో అభిమానులు షాక్ అవుతున్నారు. పూజా ప్రస్తుతం వరుస పరాజయాలతో ఉంది.. ఆమెను తీసుకొని రిక్స్ తీసుకోవడం అవసరమా అన్న అంటూ ధనుష్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..