
అందాల భామ పూజా హెగ్డే కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది. ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలనే బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొడుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్నా ఈ భామకు మాత్రం హిట్స్ అందుకోలేకపోతుంది. 2020లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా తర్వాత పూజా హెగ్డే సరైన హిట్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత పూజా చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ గా మారాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసినా కూడా ఫలితం లేకపోయింది.. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో పూజకు ఆఫర్స్ తగ్గాయి. చిన్న గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది. కానీ హిట్స్ మాత్రం అందుకోలేకపోతుంది. అయితే తాజాగా పూజా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఓ స్టార్ హీరోతో కలిసి నటించడానికి తాను ఎప్పుడూ సిద్ధం అని తెలిపింది. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా?
పూజా హెగ్డే టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది. మహేష్ బాబుతో మహర్షి, ప్రభాస్ తో రాధేశ్యామ్, రామ్ చరణ్ తో ఆచార్య, ఎన్టీఆర్ సరసన ‘అరవింద సమేత’, అల్లు అర్జున్ తో అలా వైకుంఠపురంలో సినిమాలు చేసి మెప్పించింది. అలాగే తమిళ్ లో స్టార్ హీరోలతో అదేవిధంగా బాలీవుడ్ లో బడా హీరోలతో కలిసి నటించింది. అయితే తాను ప్రభాస్ తో నటించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను అని తెలిపింది.
ఓ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ.. తనకు ప్రభాస్ అంటే ఇష్టమని.. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. అలాగే బాహుబలి 3 తెరకెక్కిస్తే కచ్చితంగా నటిస్తా.. పాత్ర కోసం ఎలాంటి త్యాగమైన చేస్తా.. ప్రభాస్‌తో మరోసారి కలిసి నటించేందుకు తాను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, ప్రభాస్ తో రొమాన్స్ కు రెడీ అంటూ చెప్పుకొచ్చింది పూజా. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.